రూ. కోటి సంపాదించినా కష్టమేనా? 20 ఏళ్లలో ఎంతవుతుంది? 2046 కల్లా ఇదీ పరిస్థితి?

Wait 5 sec.

in India: మన దేశంలో పెట్టుబడుల కోసం ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందుకోసం చిన్న వయసు నుంచే డబ్బును ఆదా చేస్తుంటారు. . అయితే ఇక్కడే మీరు ఒక సమీక్ష వేసుకోవాలి. మీరు పెట్టుకున్న టార్గెట్ అమౌంట్.. భవిష్యత్తులో సరిపోతుందా.. అప్పటి ఖర్చుల్ని తీర్చేందుకు అది సరిపోతుందా అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు 2026లో ఉన్నాం.. మరో 20 ఏళ్లకు అంటే 2046 లో మీ చేతిలో రూ. 1 కోటి ఉంటే.. ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లేనా.. అప్పుడు ఏం ఇబ్బందులు లేకుండా దానితో జీవించొచ్చా? ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే రూ. కోటి పెద్ద మొత్తమే అనిపిస్తుంది. ఇది సరిపోతుంది ఏం చక్కా హాయిగా జీవించొచ్చని అనుకుంటుంటారు. అయితే రిటైర్మెంట్ కల్లా ఇది సరిపోతుందని కచ్చితంగా చెప్పలేం. ఇక్కడే అసలు విషయం తెలుసుకోవాలి. డబ్బు కొనుగోలు శక్తిని తగ్గించే.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో చూస్తే ఆ చాలా తక్కువ అని చెప్పొచ్చు. పెరిగితే.. కొనుగోలు శక్తి తగ్గుతుంది. అంటే.. రూ. 100 తో ఇప్పుడు కొనగలిగినన్ని వస్తువులు అప్పుడు రావు. అప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే.. ద్రవ్యోల్బణం డబ్బు విలువను తగ్గిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధిలోనే ఉంటూ వస్తుంది. కొన్నేళ్లుగా 4 శాతం దిగువనే ఉంటుంది. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పొచ్చు. ఉదాహరణకు మనం 5-7 శాతంగా ద్రవ్యోల్బణం అంచనా వేసుకుంటే.. రూ. కోటి వాల్యూ.. 20 ఏళ్లలో ఎంతవుతుందో.. అంటే 2046 కు అది ఎంత మొత్తానికి సమానం అవుతుందో చూద్దాం. ఎంత ద్రవ్యోల్బణంపై రూ. కోటి విలువ ఎంతవుతుంది?5 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే 2046 కల్లా రూ. కోటి విలువ రూ. 37-40 లక్షల వరకే ఉంటుంది. ఇదే 6 శాతం ప్రకారం చూస్తే రూ. 31-32 లక్షలకే పరిమితమవుతుంది. 7 శాతం ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే ఇంకా తక్కువగా రూ. 25-26 లక్షలకే చేరుతుంది. అంటే.. 20 ఏళ్లలో డబ్బు విలువ దాదాపు సగానికంటే ఎక్కువే పడిపోయిందని చెప్పొచ్చు. అంటే.. ఇప్పుడు రూ. 1 కోటితో కొనగలిగిన వస్తువులు.. 2046 లో కొనాలంటే దాదాపు రూ. 3 కోట్లకుపైనే ఉండాలన్నమాట. భవిష్యత్తులో ఎన్నో ఖర్చులు..అందుకే.. దానికి తగ్గట్లుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రణాళిక కాబట్టి.. రోజురోజుకూ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి.. ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసి.. ఇన్వెస్ట్ చేసి సంపద సృష్టించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైద్య ఖర్చులు, చదువు ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు ఇవన్నీ చాలా ఖరీదుగా మారిపోతాయి. లైఫ్‌స్టైల్ కూడా మారిపోతుంది. అందుకే.. అప్పుడు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలంటే రూ. కోటి సరిపోదు. దాదాపు రూ. 2-3 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్లుగా పొదుపు, పెట్టుబడుల ప్రణాళికలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సంపద సృష్టికి ఏం చేయాలి?దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ దీర్ఘకాలంలో మెరుగైన రాబడి కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల సలహాలు పాటించడం మంచిది. రిస్క్ లేకుండా ఈక్విటీ, డెట్ ఫండ్ల మధ్య సమతుల్యం పాటించాలి. . ఏటా 8-10 శాతం వరకు పెట్టుబడులు పెంచాలి. ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోవాలి. ఇలా దీర్ఘకాలంలో ఇంకాస్త పెద్ద మొత్తమే సమకూర్చుకునేలా చేస్తుంది.