: తమ ఆర్థిక లక్ష్యాలను వేగంగా చేరుకుని, పెద్ద మొత్తంలో ఆదాయం పొందాలనుకునే వారికి అత్యంత ఆదరణ పొందిన పెట్టుబడి మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ ఒకటి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించి వాటితో సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేందుకు ఫండ్ మేనేజర్ ని నియమిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు తాము పెట్టిన డబ్బులకు తగినట్లుగా తాజా నెట్ అసెట్ వాల్యూ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. పెట్టుబడులు పెట్టవచ్చు. లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్ సమ్ విధానంలోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, అనేవి మార్కెట్లకు లింక్ అయి ఉంటాయి. స్కీమ్ ఆధారంగా రిస్క్ అనేది ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందే అన్ని రకాల నిబంధనలు, షరతులు తెలుసుకోవాలి. భవిష్యత్తులో మూలధన లాభాలు అందుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం అనేది సరైన నిర్ణయంగా చెబుతారు. 5-15 ఏళ్ల దీర్ఘకాలంలో హైరిటర్న్స్ పొందేందుకు ఇందులో అవకాశం ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్‌లో కొన్నిసార్లు తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తుంది. అది తప్పనిసరి లేదా గిఫ్ట్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. గిఫ్ట్‌గా ఇవ్వాలంటే ఏం చేయాలి?మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది అంత సులభమైనది కాదని చెబుతారు. అయితే, మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఉపయోగించి మీ యూనిట్లను మీకు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఈజీగానే గిఫ్ట్ రూపంలో ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అందుకు మొదటగా మీరు మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డీమ్యాట్ ఫార్మాట్‌లోకి మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత గిఫ్ట్ గా వారికి అందించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్ లోకి లాగిన్ కావాలిమ్యూచువల్ ఫండ్స్ సెక్షన్‌లో ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి.మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకునే ఫండ్‌ని ఎంచుకుని, ఎన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలో నిర్ణయించాలిమీరు ఏ డీమ్యాట్ అకౌంట్లకి యూనిట్లను మార్చాలనుకుంటున్నారో ఎంచుకోవాలిఅన్ని వివరాలు ఓసారి తనిఖీ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఒక వేళ మీరు ఆఫ్‌లైన్ ద్వారా గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ముందుగా మీరు మీ సమీపంలోని డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) దగ్గరికి వెళ్లాలి. కన్వర్షన్ రిక్వెస్ట్ ఫారం తీసుకోవాలి. అన్ని వివరాలు ఫారంలో పేర్కొని మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్మెంట్‌ జత చేసి సమర్పించాలి. డీపీ మీ యూనిట్ల ట్రాన్స్‌ఫర్ ప్రారెస్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్ విలువలో 0.03 శాతం ట్రాన్సాక్షన్ ఫీ చెల్లించాలి. లేదా రూ.25 ఏది ఎక్కువ ఉంటే అది కట్టాలి. అలాగే వాటిపై 18 శాతం మేర జీఎస్టీ సైతం చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా 0.015 శాతం స్టాంప్ డ్యూటీ సైతం చెల్లించాల్సి రావచ్చు. అందుకే ముందుగానే అన్ని వివరాలు తెలుసుకుని ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ ప్రక్రయను పూర్తి చేయడం మంచిది.