చీపెస్ట్ పర్సనల్ లోన్స్.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో రూ. 1 లక్ష, 5 లక్షలపై ఐదేళ్లకు నెలకు ఈఎంఐ ఎంత?

Wait 5 sec.

Personal Loan Interest Rates: మనకు రోజురోజుకూ అవసరాలు పెరిగిపోతున్నాయి. దీంతో వచ్చే జీతం చాలట్లేదు. అందుకే చాలా మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బ్యాంకులు కూడా గతంలో కంటే ఇప్పుడు వేగంగా.. పెద్దగా డాక్యుమెంటేషన్‌తో పని లేకుండానే రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక్కడ . అందుకే వడ్డీ రేట్లు కాస్త ఎక్కువే ఉంటాయి. ఆర్బీఐ కీలక రెపో రేట్లను కొంత కాలంగా తగ్గిస్తున్న నేపథ్యంలో ఈ వడ్డీ రేట్లు కాస్త దిగొచ్చాయి. సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండి.. స్థిర ఆదాయం ఉంటే గనుక ప్రారంభ వడ్డీకే లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది. వడ్డీ రేట్లు కంపేర్ చేసుకోవాలి?అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చుకోవాలి. మీ అవసరాల్ని బట్టి.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటుకు ఎంత లోన్ వస్తుంది.. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర రుసుములు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. ఉదాహరణకు రూ. 1 లక్ష, రూ. 5 లక్షల లోన్‌పై ఐదేళ్ల టెన్యూర్‌కు ఈఎంఐ నెలకు ఎంత చెల్లించాలి.. ప్రాసెసింగ్ రుసుములు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వ బ్యాంకుల్లో 8.75 శాతం వడ్డీ రేట్ల నుంచే పర్సనల్ లోన్..ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో కనీసం 8.75 శాతం వడ్డీకే పర్సనల్ లోన్స్ ప్రారంభమవుతున్నాయి. యూనియన్ బ్యాంకులో 8.75-12.55 శాతంగా వడ్డీ రేట్లు ఉండగా.. 5 లక్షల రుణంపై ఐదేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 10,319-11,262 గా ఉంది. అదే లక్ష లోన్‌పై ఐదేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 2064-2252 గా ఉంది. లోన్ మొత్తంలో ప్రాసెసింగ్ రుసుము ఒక శాతంగా ఉంది. గరిష్ఠంగా రూ. 7500 వరకు వసూలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.75-13.55 శాతంగా వడ్డీ రేట్లు ఉండగా.. ఐదు లక్షల లోన్‌ తీసుకుంటే ఐదేళ్లకు ఈఎంఐ నెలకు రూ. 10,319-11,518 గా ఉంది. లక్షపై రూ. 2064-2304 పడుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతంగానే ఉంది. ఎస్బీఐ పర్సనల్ లోన్..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10-15 శాతం మధ్య ఉన్నాయి. ఇక్కడ 5 లక్షల లోన్‌పై నెలకు ఈఎంఐ రూ. 10,624-11,895 గా ఉంది. లక్ష లోన్‌పై చూస్తే రూ. 2,125-2,379 ఈఎంఐ పడుతుంది. ఇక్కడ లోన్ మొత్తంలో 1.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇది రూ. 1000- రూ. 15 వేల మధ్య ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో కాస్త ఎక్కువే..ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో చూసినట్లయితే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల్లో 9.99 శాతం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ స్థిర ఆదాయంతో పాటు మెరుగైన సిబిల్ స్కోరు ఉంటే ఈ వడ్డీ రేటుతో లోన్ వస్తుంది. ఇక్కడ 5 లక్షలపై నెలకు ఈఎంఐ రూ. 10,621 నుంచి మొదలవుతుంది. లక్షపై రూ. 2,124 నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుల విషయానికి వస్తే HDFC లో రూ. 6500 వరకు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకులో మొత్తం తీసుకునే లోన్‌లో 2 శాతం వరకు పడుతుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో 3.5 శాతం వరకు చెల్లించాలి. యాక్సిస్ బ్యాంకులో 9.60 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. 5 లక్షల రుణంపై ఈఎంఐ రూ. 10,525 నుంచి ఉండగా.. లక్ష లోన్‌పై రూ. 2,105 నుంచి ఉంది. ఇక్కడ లోన్ మొత్తంలో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.