క్యూ4 ఫలితాలతో పాటు ఇన్ఫోసిస్‌ మరో 2 శుభవార్తలు.. 20 వేల ఫ్రెషర్లకు అవకాశం.. జూన్ 25న ఖాతాల్లోకి డబ్బులు!

Wait 5 sec.

: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అంచనాలను అందుకుంటూ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లోని జనవరి-మార్చి త్రైమాసికంలో 20.8 శాతం వృద్ధితో రూ.8501 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే నాలుగో త్రైమాసికంలో కంపెనీ మొత్తం లాభం రూ.7033 కోట్లుగా ఉంది. ఈ సందర్భంగా తమ షేర్ హోల్డర్లతో పాటు ఐటీ ఉద్యోగార్థులకు అదిరే శుభవార్త అందించింది. క్యూ4 ఫలితాలు, కంపెనీ ప్రకటనల గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.46,402 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 40,925 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం 2025- 26కు చూసుకుంటే ఇన్ఫోసిస్ నికర లాభం 10.20 శాతం పెరిగి రూ. 29,440 కోట్లుగా నమోదు చేసింది. ఇక 2024- 25 ఆర్థిక ఏడాదిలో కంపెనీ మొత్తం లాభం రూ. 26,713 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 9.6 శాతం పెరిగి రూ .1,78,650 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక ఏడాదిలో 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది.20 వేల మంది ఫ్రెషర్లకు అవకాశంఇన్ఫోసిస్ ప్రకటన చేసింది. త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్ రాజ్కా ఈ విషయాన్ని తెలిపారు. ఇన్ఫోసిస్ లో మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594 గా ఉన్నట్లు వెల్లడించారు.రూ. 25 చొప్పున డివిడెండ్ ప్రకటనక్యూ4 ఫలితాల ప్రకటన క్రమంలో తమ షేర్ హోల్డర్లకు ఇన్ఫోసిస్ అదిరే శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించి ఒక్కో షేరుకు రూ. 25 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని జూన్ 10, 2026గా నిర్ణయించింది. అలాగే జూన్ 25, 2026 రోజున అర్హులైన షేర్ హోల్డర్ల ఖాతాల్లో ఈ డివిడెండ్ సొమ్మును జమ చేస్తామని తెలిపింది.