ఆర్టీసీ కార్మికులు.. రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలోనే బస్సులను డిపోల నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం వరంగల్ జిల్లా ప్రయత్నించడం పెను సంచలనం రేపింది. ఆ తర్వాత మిర్యాలగూడలోనూ అదే రకంగా ఓ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. మరో డ్రైవర్ గడ్డిమందు తాగి ఆత్మహత్య యత్నం చేయడం సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఉద్రిక్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మిర్యాలగూడ డిపోలో పనిచేస్తున్న వెంకన్న అనే డ్రైవర్‌.. ఆత్మహత్యకు ప్రయత్నించడం దుమారం రేపుతోంది. నల్గొండ డిపో వద్ద చేస్తున్న నిరసనల్లో భాగంగా డ్రైవర్ వెంకన్న.. తన శరీరంపై డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అది గమనించి వెంటనే అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు, పోలీసులు ఆయన్ను కాపాడారు.ఇక భద్రాచలం డిపో డ్రైవర్ లింగారెడ్డి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఖమ్మంలో తన ఇంటి వద్ద లింగారెడ్డి పురుగుల మందు తీసుకున్నాడు. దీంతో అది గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని.. చికిత్స జరుగుతోందని డాక్టర్లు తెలిపారు.నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఇవాళ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో శంకర్ గౌడ్‌కు తీవ్ర గాయాలు కాగా.. హుటాహుటిన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. శంకర్ గౌడ్‌కు 80 శాతం కాలిన గాయాలు కావడంతో అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌ సత్య శారద, సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌లు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరిశీలించారు. పరిస్థితి విషమించడంతో శంకర్ గౌడ్‌ను హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు వరుసగా ముగ్గురు డ్రైవర్లు.. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్‌పై విమర్శలకు తావిస్తోంది.