పాత 1 రూపాయి నోటు నుంచి కొత్త రూ.2000 నోటు వరకు.. మన దేశ కరెన్సీ నోట్ల వీడియో వైరల్.. మీరు చూశారా?

Wait 5 sec.

Paper Currency Notes: మన భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రూపాయి, 2 రూపాయల నోట్లు చలామణిలో కనిపించడం లేదు. అయితే, ఒకప్పుడు ఈ నోట్లకు భారీ డిమాండ్ ఉండేది. కరెన్సీ విలువ తగ్గిపోతున్న క్రమంలో పెద్ద నోట్ల ముద్రణ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రూ.50, రూ.100, రూ.500 నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, మనలో చాలా మందికి పాత నోట్లు ఎలా ఉండేవో తెలియకపోవచ్చు. అలాంటి వారందరికి అవగాహన కల్పించేలా భారతీయ కరెన్సీ నోట్ల పరిణామక్రమాన్ని వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియో చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ సమయంలో ఎలాంటి నోట్లు ఉపయోగించారు అనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు.ఈ వీడియోను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంసాద్ టీవీ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు భారతీయ కరెన్సీ నోట్లలో వచ్చిన మార్పులను ఇందులో చూడవచ్చు. ఈ వీడియోను తమ పిల్లలకు చూపించాలని సంసాద్ టీవీ సూచించింది. తద్వారా మన కరెన్సీ చరిత్ర, పరిణామక్రమం గురించి సులువుగా తెలుసుకోగలరని పేర్కొంది. ఈ వీడియో ద్వారా పాతకాలంలో నోట్లు ఎలా ఉన్నాయి, వాటిపై ఏ చిత్రాలు ముంద్రించారు అనేవి తెలుస్తాయని పేర్కొంది.'చాలా సమాచారవంతమైన వీడియో. ఈ వీడియో ద్వారా పాత, కొత్త భారతీయ పేపర్ కరెన్సీని చాలా ఆకర్షణీయమైన పద్ధతిలో చూపించారు. పాత కాలం నుంచి కరెన్సీలో వచ్చిన పరిణామక్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది మంచి సందర్భంగా చెప్పవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోను చూడాలి. అలాగే మీ పిల్లలకూ చూపించాలి. దీని ద్వారా వాళ్లు చాలా సులభంగా చరిత్రను తెలుసుకోగలుగుతారు. అలాగే మన కరెన్సీ పరిణామక్రమాన్ని తెలుసుకోవచ్చు.' అని సంసాద్ టీవీ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.కరెన్సీ నోట్లను చూపిస్తూ వెళ్లారు. మహాత్మా గాంధీ గారి చిత్ర పటం లేకుండా ముద్రించినప్పటు కరెన్సీని సైతం మనం ఈ వీడియో ద్వారా వీక్షించవచ్చు. ఏ విలువ గల కరెన్సీని ఎన్ని రకాలుగా ముద్రించారో తెలుసుకోవచ్చు. నాణేలు రాకముందు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయు నోట్లు ఎన్ని రకాలుగా ఉండేవో తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.