హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు శుభవార్త, ఈ నంబర్లకు కాల్ చేయండి

Wait 5 sec.

ఉద్యోగాల భర్తీ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో.. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల కోసం సికింద్రాబాద్ పరిధిలోని అన్ని డిపోల మేనేజర్‌లు ఎదురుచూస్తున్నారు. తగిన అర్హతలు కలిగి ఉన్న వారు.. దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా డిపోల ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సికింద్రాబాద్ రీజియన్‌లోని చెంగిచర్ల, ఉప్పల్, కుషాయిగూడ, రాణిగంజ్, కంటోన్మెంట్, హకీంపేట, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, హెచ్‌సీయూ, మియాపూర్-1, మియాపూర్-2 డిపోల్లో సంప్రదించాలని పేర్కొంటున్నారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని డిపోల్లో బస్సులను నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్, స్కూళ్లకు సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరగ్గా.. మరోవైపు సమ్మె కారణంగా బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక కండక్టర్లుగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు ఒరిజినల్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లతో దగ్గర్లో ఉన్న బస్ డిపోలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేసేవారు తమ ఒరిజినల్ హెవీ వెహికల్ లైసెన్స్(హెచ్ఎంవీ లైసెన్స్)తో బస్ డిపోలో రిపోర్ట్ చేయాలని పేర్కొంటున్నారు. అయితే బస్సు డ్రైవర్‌గా అప్లై చేసుకునే వారికి 18 నెలల ఎక్స్‌పీరియన్స్ ఉండాలని తెలిపారు. కండక్టర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునేవారి పదో తరగతి పాస్ అయితే సరిపోతుందని వెల్లడించారు. రోజువారీగా డ్రైవర్లకు రూ.1000.. కండక్టర్లకు రూ.800 గౌరవ వేతనం చెల్లించనున్నారు.సికింద్రాబాద్ పరిధిలోని డిపోల్లో సంప్రదించాల్సిన నెంబర్లుచెంగిచర్ల (Chengicherla) - 7893088433ఉప్పల్ (Uppal) - 9959226140కుషాయిగూడ (Kushaiguda) - 9959226145రాణిగంజ్ (Ranigunj) - 9959226147కంటోన్మెంట్ (Cantonment) - 9959226143హకీంపేట (Hakimpet) - 9959226144మేడ్చల్ (Medchal) - 9959226152జీడిమెట్ల (Jeedimetla) - 9959226150కూకట్‌పల్లి (Kukatpally) - 9959226151హెచ్‌సీయూ (HCU) - 9959226132మియాపూర్-1 (Miyapur - I) 9959226153మియాపూర్-2 (Miyapur - II) 9959226420