అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన.. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, తమ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖలను కూడా సమర్పించినట్టు తెలిపారు. అనర్హత నుంచి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల కాలంలో ఇటువంటి కొత్త విధానాలు అవలంభిస్తున్నారు. పార్టీ ఎంపీల్లో చీలిక వర్గానికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హతకు గురయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆప్‌ ఎంపీలు కూడా అదే చేశారు. గతంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఇలాగే వ్యవహరించారు.2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయి తర్వాత ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావులు పార్టీకి రాజీనామా చేసి.. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి తమ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అప్పట్లో టీడీపీకి ఐదుగురు రాజ్యసభలు ఉండగా.. కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రం పార్టీని వీడలేదు. మిగతా నలుగురు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ పేరా 4(2)లోని నిబంధనలను అనుసరించి బీజేపీలోకి ఫిరాయించారు. సభలో పార్టీకున్న మొత్తం సభ్యుల్లోని మూడింటి రెండొంతుల మంది ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమైనప్పుడు దాన్ని విలీనంగా పరిగణించాలని ఈ నిబంధన చెబుతుంది. దీనిని అనుసరించే తాము ఇప్పుడుఆ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది ఉండగా అందులో ఏడుగురు బీజేపీలో చేరుతుండటం వల్ల పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు తప్పించుకుంటారు. ఆప్‌ను వీడుతున్న ఎంపీల్లో ఒకరు ఢిల్లీ, ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. మరో పార్టీలోకి మారేటప్పుడు అప్పటి వరకూ ఉన్న పదవులకు రాజీనామా చేయాలా? వద్దా? అనేది ఎప్పటికీ చర్చనీయాంశమే.