కువైట్, ఖతార్ సహా పలు దేశాల్లో జీరో ఇన్‌కంటాక్స్.. మరి భారత్‌లో ఎందుకు తప్పనిసరి.. కారణాలివే!

Wait 5 sec.

: ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను లేకపోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఇలా పర్సనల్ ఇన్‌కంటాక్స్ లేదు. ఇందులో యూఏఈ (దుబాయ్), ఖతార్, కువైట్ వంటివి ఉన్నాయి. మరి అసలు ఇన్‌కం టాక్స్ ఆదాయం లేకుండా ఆ దేశాలు ఎలా నడుస్తున్నాయి. భారత్‌లో మాత్రం టాక్స్ తప్పనిసరి ఎందుకు..? కాస్త వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఏయే దేశాల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదనేది తెలుసుకుందాం. యూఏఈ (దుబాయ్)దుబాయ్‌లో పర్సనల్ ఇన్‌కంటాక్స్ లేనేలేదు. ఇంకా చాలా వరకు వ్యాపారాలకు ఇక్కడ కార్పొరేట్ టాక్స్ కూడా లేదు. అందుకే టాక్స్ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌గా ఇది ఉంది. డివిడెండ్లు, వడ్డీ రాబడిపైనా ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేవలపై వాల్యూ యాడెడ్ టాక్స్‌లు, ఎక్సైజ్ టాక్స్‌లు, దిగుమతి సుంకాలు వంటివి ఉంటాయి. ఖతార్దుబాయ్ మాదిరిగానే ఖతార్‌లో కూడా పర్సనల్ ఇన్‌కం టాక్స్ లేదు. అంటే వ్యక్తిగతంగా సంపాదించిన ఆదాయంపై పన్ను ఉండదు. ఇక్కడ కూడా కార్పొరేట్ టాక్స్ ఉండదు. వస్తు, సేవలపై 5 శాతం వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) ఉంటుంది. కువైట్ఇక్కడ కూడా వ్యక్తిగత ఆదాయంపై టాక్స్ లేదు. ఇక్కడ ఇన్‌డైరెక్ట్ టాక్స్‌లు, రుసుములు ఉంటాయి. దిగుమతులపై సుంకాలు ఉంటాయి. వీటితో పాటు ఒమన్, బహ్రెయిన్, బహమాన్, మొనాకో, కేమన్ ఐలాండ్స్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కూడా వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేదు. భారత్‌లో పన్ను పరిమితి ఎలా?ఇదిలా ఉంటే.. . ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానం అమల్లో ఉండగా.. పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ లేదు. వేతన జీవులకు రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉండగా రూ. 5.50 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ ఉండదు. ఆపైన పన్ను రేట్లను బట్టి టాక్స్ ఉంటుంది. ఇంకా కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ లేదు. వేతన జీవులకు రూ. 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ ఉండదు. మరి ఇక్కడ ఇతర దేశాల్లో టాక్స్ లేదు. భారత్‌లో ఎందుకు ఉంది అనే ప్రశ్న మీకు రావొచ్చు. దీని గురించి ఇప్పుడు చూద్దాం. పైన చెప్పుకున్న .. ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడిన దేశాలు. ఈ దేశాల్లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ దేశాలకు ప్రభుత్వ ఆదాయం ఆయిల్, గ్యాస్ సరఫరా ద్వారా ఎక్కువగా వస్తుంది. దీంతో ప్రజలపై టాక్స్ విధించే అవసరం తక్కువగా ఉంటుంది. భారత్‌లో టాక్స్ ఎందుకు విధిస్తున్నారంటే?భారత్ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. అసలే మనది పెద్ద దేశం. 140 కోట్లకుపైగా జనాభా ఉంది. అందుకే.. జనాభాకు తగ్గట్లుగా నిర్వహణకు భారీ ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా మౌలిక వసతులు (రోడ్లు, రైల్వేలు), ఆరోగ్యం, విద్య సహా రక్షణ ఖర్చులు, సంక్షేమ పథకాల్ని అమలు చేయడం ఇలా చాలానే ఖర్చులు ఉంటాయి. వీటిని నిర్వహించేందుకే ప్రభుత్వం పర్సనల్ ఇన్‌కంటాక్స్ సహా జీఎస్టీ, కార్పొరేట్ టాక్స్ వంటివి విధిస్తుంది. భారత్‌లో ముఖ్యంగా ఆయిల్ ఆదాయం లేదు. జనాభా ఎక్కువ. అభివృద్ధి ఖర్చులు భారీగా ఉన్నాయి. అందుకే.. ఇన్‌కంటాక్స్ భారత్‌కు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉంది.