జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలిస్తే పథకాలు ఆగిపోతాయా..? కేంద్రమంత్రి క్లారిటీ

Wait 5 sec.

జనగణనలో భాగంగా తెలంగాణలో ప్రారంభమైంది. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఎన్యూమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెన్సస్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి అధికారిక జనగణన ఇది అని, ప్రజలు తమ వివరాలను నిర్భయంగా నమోదు చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. అయితే జనగణనలో వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అపోహలు వీడాలని, ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరిగి పోలింగ్ శాతం పెరుగుతుందని వెల్లడించారు. దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు జనాభా గణన కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అధికారిక జనాభా గణన ఇదే కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన గుర్తుచేశారు. జనాభా గణన అనేది కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని అది ఒక ప్రాంతం అవసరాలను, ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణయించే కీలకమైన శాస్త్రీయ ప్రక్రియ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రజల్లో నెలకొన్న కొన్ని అపోహలపై ఆయన స్పందిస్తూ.. వ్యక్తిగత వివరాలు అందజేస్తే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రచారం చేయడం కేవలం భ్రమ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రతి పౌరుడు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని, చట్టబద్ధమైన రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఖచ్చితత్వంతో కూడిన డేటా ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు.ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నకూడా కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో పేరుకుపోయిన తప్పులను సరిదిద్దడం, డూప్లికేట్ ఓట్లను తొలగించడం ద్వారా పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉండడం వల్ల పోలింగ్ శాతం 50 శాతానికి మించడం లేదని ప్రక్షాళన పూర్తయితే ఈ పరిస్థితి మారుతుందని చెప్పారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మే 10వ తేదీతో ముగుస్తుందని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకురాలు భారతి హొళికెరి తెలిపారు. ఆ తర్వాత మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశలో ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని స్పష్టం చేశారు.