ఇప్పుడిప్పుడే తన పాత ఫామ్‌లోకి తిరిగి వచ్చేస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పెద్దగా రాణించలేకపోయిన ఈ హార్డ్ హిట్టర్ ఆరంభంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో ఇక పనయిపోయింది అనుకున్న టైమ్‌లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో తీసుకొచ్చాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది అంటే అది కేవలం రింకూ సింగ్ వల్లే అని చెప్పొచ్చు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ప్రాణం పెట్టి చేశాడు. ఫలితంగానే లో టార్గెట్ మ్యాచ్ ఆఖరి బంతి వరకూ సాగింది. సూపర్ ఓవర్‌లోనూ బౌండరీ దగ్గర పావెల్ అందించిన క్యాచ్‌ను పట్టుకుని కేకేఆర్ విక్టరీలో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ సైఫర్ట్ 0, రహానే 10, రఘువంశీ 9, పావెల్ 1, అనుకుల్ రాయ్ 0, రమణదీప్ సింగ్ 6 పరుగులే చేసి అవుటవ్వడంతో కేకేఆర్ కేవలం 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ తీరు చూసి అందరూ కేకేఆర్ 100 పరుగుల లోపే ఆలౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ.. రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. నాన్‌స్ట్రయిక్ ప్లేయర్లను వికెట్లు కాపాడమని చెప్తూ.. తాను బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 51 బంతులు ఆడిన రింకూ ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా కేకేఆర్ 155/7 పరుగులు చేసింది.ఈజీ టార్గెట్‌ మ్యాచ్‌లో లక్నో విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, కేకేఆర్ బౌలర్లు రాణించడం, రింకూ సింగ్ నాలుగు క్యాచ్‌లతో ఫీల్డ్‌లో అదరగొట్టాడు. ఆఖరి బంతికి షమీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ డ్రా అయింది. సునీల్ నరైన సూపర్ ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ సింగ్ తొలి బంతే బౌండరీ బాది కేకేఆర్‌కు బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు అందించాడు. ఈ సీజన్ తొలి ఆరు మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌పై వరుస విజయాలు సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ రింకూ సింగే మ్యాచ్ విన్నర్‌గా ఉండటం విశేషం. వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని రింకూ సింగ్ ఈఝ్ బ్యాక్ అనిపించుకున్నాడు.