ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ హీరోలు.. గల్లీ క్రికెట్ ఆడిన టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్!

Wait 5 sec.

ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. తో మ్యాచ్ సందర్భంగా అక్కడికి వెళ్లిన ఆర్సీబీ ప్లేయర్లు సరదాగా బయటకు వెళ్లారు. సొంతగడ్డ ఢిల్లీ వీధుల్లో అలా షికార్లు చేస్తున్న సమయంలో గల్లీ క్రికెట్‌ ఆడారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అక్కడ కొందరు గల్లీ క్రికెట్ ఆడటం చూసిన , వెంటనే అక్కడికి వెళ్లారు. అక్కడున్న పిల్లతో కలిసి కాసేపు మాట్లాడిన ఈ ఇద్దరు ప్లేయర్లు, వారితో కలిసి గల్లీ క్రికెట్ ఆడేశారు. కొద్దిసేపు టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేస్తే, ఆ తర్వాత రొమారియో షెఫర్డ్ ఆడాడు. ఢిల్లీ వీధుల్లో ఈ ఇద్దరు విదేశీ ప్లేయర్లు సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అక్కడున్న వాళ్లు తమ తమ ఫోన్లలో వీడియోను రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గతంలో కూడా చాలా మంది విదేశీ ప్లేయర్లు గల్లీ క్రికెట్ ఆడారు. ఐపీఎల్ 2025 జరుగుతున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ముంబై వచ్చిన జోస్ బట్లర్ అప్పట్లో సందడి చేశాడు. ఒక్కడే ముంబై వీధుల్లో తిరుగుతూ అక్కడున్న పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మళ్లీ ఇప్పుడు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ కలిసి ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు. ఇక ఐపీఎల్ 2026 విషయానికి వస్తే విరాట్ కోహ్లి సొంతగడ్డ ఢిల్లీలో దంచికొట్టేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఈ సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించి మరోసారి ఢిల్లీ తన సత్తా చాటింది. గతేడాది కూడా ఆర్సీబీని వాళ్ల సొంతగడ్డ మీదే ఢిల్లీ ఓడించింది. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది కూడా అదే జోష్‌తో దూసుకుపోతోంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఐదు గెలిచి పది పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో విజయం సాధించి, ఆ తర్వాత వరుస ఓటముల పాలయింది. ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరి కోహ్లి సొంతగడ్డపై ఢిల్లీ మళ్లీ గెలుస్తుందేమో వేచి చూడాలి.