Latest : . చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం సహా సెస్ పూర్తిగా తొలగించడంతో ధరలు వేలల్లో తగ్గుముఖం పట్టాయి. మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని . ఇదే సమయంలో కొన్నేళ్లుగా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ రేట్లు తగ్గడం ఒక కారణం అయితే.. బ్యాంకులు కూడా కార్లను కొనుగోలు చేసే వారికి విరివిగా రుణాల్ని ఆఫర్ చేస్తుండటం మరో కారణం. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి ఇంకా చాలా తక్కువ వడ్డీ రేటుకే లోన్ వస్తుంది. చాలా బ్యాంకులు కార్ ఆన్ రోడ్ ప్రైస్‌లో దాదాపు 80-90 శాతం వరకు లోన్ ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే 100 శాతం వరకు కూడా ఫైనాన్సింగ్ ఇస్తున్నాయి. అందుకే మనం లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. వడ్డీ రేట్లలో కాస్త తేడా ఉన్నా.. చెల్లించాల్సిన ఈఎంఐలో భారీ మార్పు ఉంటుందని తెలుసుకోవాలి. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్ల రుణాలపై వడ్డీ రేట్లు కనీసం 8.70 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ప్రతీ రూ. 1 లక్ష రుణంపై ఏడేళ్ల వ్యవధికి ఈఎంఐ నెలకు రూ. 1594 చొప్పున పడుతుంది. అంటే ఎన్ని లక్షలు తీసుకుంటే.. ఈఎంఐ అన్ని రెట్లు పెరుగుతుందన్నమాట. అంటే రూ. 2 లక్షల రుణంపై 2x1594= రూ. 3188 ఇలా పడుతుంది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చూస్తే 8.15 శాతం ప్రారంభ వడ్డీ రేటుకే కార్ లోన్ అందుబాటులో ఉంది. ఇక్కడ లక్ష లోన్‌పై ఈఎంఐ రూ. 1566 చొప్పున ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో కార్ లోన్లపై వడ్డీ రేట్లు 8.50 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ నెలకు ఈఎంఐ రూ. 1584 గా ఉంది. యాక్సిస్ బ్యాంకులో 8.95 శాతం నుంచి మొదలవుతుండగా.. ఏడేళ్లకు నెలకు ఈఎంఐ రూ. 1606 గా ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో కాస్త ఎక్కువగా 9.99 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఇక్కడ ఈఎంఐ నెలకు కాస్త ఎక్కువగా రూ. 1660 నుంచి ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7.60 శాతం నుంచే మొదలవుతున్నాయి. ఇక్కడ ప్రతి లక్ష రుణంపై నెలకు ఈఎంఐ రూ. 1539 గా పడుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 7.40 శాతం నుంచే కార్ లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అత్యల్పంగా ఈఎంఐ నెలకు రూ. 1529 గా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకుల్లో 7.45 శాతం నుంచి ఉండగా.. నెలకు ఈఎంఐ రూ. 1531 పడుతుంది.గమనిక: పైన చెప్పినవి ఆయా బ్యాంకుల్లో వసూలు చేసే అత్యల్ప లేదా కనీస వడ్డీ రేట్లు మాత్రమే. క్రెడిట్ స్కోరు, ఆదాయం సహా ఇతర కీలక అంశాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం బ్యాంకుల్ని సంప్రదించడం మంచిది.