ఆప్ Vs ఢిల్లీ హైకోర్టు జడ్జి: కేజ్రీవాల్- సిసోడియా కోర్టు బహిష్కరణ.. 10 కీలక అంశాలు

Wait 5 sec.

ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన న్యాయపోరాటం ఒక అసాధారణ మలుపు తీసుకుంది. , ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరుకావడానికి నిరాకరించారు. ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తిని తప్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో ఈ వివాదం చెలరేగింది. న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం అభిప్రాయాలు, సందేహాలు లేదా అనుమానాల ఆధారంగా విచారణ నుంచి తప్పించలేమని, ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు హెచ్చరించింది. కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరణ నుంచి తనను తప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కొట్టివేశారు. పక్షపాతం ఉందనే సహేతుకమైన అనుమానాన్ని నిరూపించే అవసరమైన చట్టపరమైన ప్రమాణాన్ని ఈ పిటిషన్ అందుకోలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ ఆరోపణలు నిర్దిష్టమైన ఆధారాల మీద కాకుండా ఊహాగానాలు, పరోక్ష ఆరోపణలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది.ఒక న్యాయమూర్తి తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవచ్చని ఒక పక్షం భావించినంత మాత్రాన కేసు నుంచి తప్పించమని కోరడానికి వీల్లేదని తీర్పులో పేర్కొన్నారు. అటువంటి పిటిషన్లకు నిష్పక్షపాతమైన వాస్తవాల మద్దతు ఉండాలని కోర్టు గమనించింది. ఆధారాలు లేని తప్పించుకునే అభ్యర్థనలను అనుమతించడం కోర్టుల సంస్థాగత విశ్వసనీయతను దెబ్బతీస్తుందని కూడా హెచ్చరించింది.స్పష్టమైన ఆధారాల ద్వారా నిరూపించే వరకు న్యాయమూర్తులు నిష్పక్షపాతంగానే ఉంటారని భావించాలని కోర్టు నొక్కి చెప్పింది. వ్యక్తిగత అనుమానాలు, ఆత్మాశ్రయ భయాలు చట్టపరమైన రుజువులకు ప్రత్యామ్నాయం కాలేవని ఉత్తర్వులో పేర్కొంది. ‘ఈ పిటిషన్ ఆధారాలతో రాలేదు.. నా సమగ్రత, నిష్పాక్షికత, పక్షపాతంపై నిందలు, పరోక్ష ఆరోపణలు, సందేహాలతో వచ్చింది’ అని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలు లేకుండా అటువంటి వాదనలను అంగీకరించడం ఒక ప్రమాదకరమైన ఆచారానికి దారితీస్తుందని కోర్టు పేర్కొంది. మునుపటి ఉత్తర్వులను విమర్శించడం లేదా విచారణల పట్ల అసంతృప్తిని పక్షపాతానికి రుజువుగా పరిగణించరాదని కూడా అది స్పష్టం చేసింది.కుటుంబ సభ్యుల వృత్తిపరమైన సంబంధాలుజస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ పిల్లలు కేంద్ర ప్రభుత్వ లీగల్ ప్యానెల్‌లో ఉన్నారని, సీబీఐ ద్వారా కేంద్రం ఈ కేసులో జోక్యం చేసుకోవడం, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనికి ప్రాతినిధ్యం వహించడం వల్ల,ఈ పరిస్థితి నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే అనుమానాలను రేకెత్తించిందని వారు వాదించారు. అయితే, వారి పిల్లల వృత్తిని సాకుగా చూపి న్యాయమూర్తులను అడ్డుకోలేమని హైకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది.నిర్దిష్ట భావజలంజస్టిస్ శర్మ అఖిల భారత అధివక్త పరిషత్ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారని, దీనివల్ల ఆమె ఒక నిర్దిష్ట భావజాలానికి అనుకూలంగా ఉండొచ్చని కేజ్రీవాల్ ఆరోపించారు. జడ్జ్‌లు వృత్తిపరమైన అనేక కార్యక్రమాలకు హాజరవుతారని, దానిని రాజకీయ ముద్రగా చూడలేమని కోర్టు స్పష్టం చేసింది.విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరుతన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ శర్మ ధర్మాసనం ముందు తాను వ్యక్తిగతంగా గానీ, తన తరపు లాయర్లు గానీ హాజరుకాబోమని ప్రకటించారు. న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్లు కనిపించాలని, తన అంతరాత్మ ప్రభోదం మేరకు మహాత్మా గాంధీ సూత్రాలను అనుసరిస్తూ ఈ ధర్మాసనం ఎదుట హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన లేఖ రాశారు.కేజ్రీవాల్ బాటలోనే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లల భవిష్యత్తు కేంద్రం చేతుల్లో ఉన్నప్పుడు ఆ న్యాయమూర్తి నుంచి న్యాయం ఆశించలేమని, అందుకే సత్యాగ్రహం బాట పడుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, తమకు అనుకూలమైన జడ్జిల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రమాదకరమని హైకోర్టు హెచ్చరించింది. అయితే, గతంలో ఇదే కేసులో జస్టిస్ స్వరణ్ కాంత్ శర్మ ఇచ్చిన ఉత్తర్వులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే ఆమె విచారణ చేయకూడదని కేజ్రీవాల్ వాదించారు. కానీ, తీర్పులు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లాలే తప్ప, జడ్జిని మార్చాలని కోరడం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొంది.కాగా, ఈ వివాదం రాజకీయ రంగును సంతరించుకుంది. న్యాయవ్యవస్థపై కేజ్రీవాల్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ ఆరోపించగా.. తమకు అన్యాయం జరుగుతోందని వాదిస్తోంది. ఈ ప్రతిష్టంభన మధ్య కేసు విచారణ ఎలా ముందుకు సాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.