'వడ్డీ రేట్లు పెంచే ఉద్దేశం లేదు'.. యుద్ధం భయపెడుతున్నా ఆర్బీఐ నుంచి కీలక సంకేతాలు!

Wait 5 sec.

: గతేడాది ద్రవ్యోల్బణం.. లక్షిత పరిధిలోనే ఉన్న క్రమంలో కీలక రెపో రేట్లను కేంద్ర బ్యాంకు భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఏకంగా 10 నెలల వ్యవధిలోనే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం తగ్గించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించగా.. జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు.. డిసెంబరులో 25 బేసిస్ పాయింట్లు ఇలా మొత్తం 1.25 శాతం తగ్గించడంతో 6.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగొచ్చింది. దీంతో బ్యాంక్.. లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ఇది సామాన్యులకు ఊరట కలిగించింది. ఇక ఈ ఏడాది మాత్రం కాస్త పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో . ఇటీవల మళ్లీ ద్రవ్యోల్బణం పెరుగుతుండగా.. వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనని రుణ గ్రహీతల్లో భయాలు నెలకొన్నాయి. >> ముఖ్యంగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది యుద్ధం. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ) సభ్యుడు రామ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని.. యుద్ధం కారణంగా నెలకొన్న చమురు సంక్షోభం, ధరల ప్రభావం తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రెపో రేటును ఇప్పట్లో పెంచే ప్రతిపాదనేదీ ఆర్బీఐ పరిశీలించట్లేదని సంకేతాలు ఇచ్చారు. ఇది సామాన్యులకు ఊరట కలిగిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. దీంతో ప్రజలపై రుణ భారం మరింత పెరుగుతుంది. వడ్డీ రేట్ల పెంపు ఉండదు..పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ.. ఇది కేవలం సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాల వల్ల వచ్చిందేనని అన్నారు రామ్ సింగ్. అయితే చమురు ధరలు పెరుగుతుండగా ఈ ప్రభావం ఇతర వస్తువుల ధరలపై కనిపిస్తుందా లేదా అన్నది నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పెట్రోకెమికల్స్ సహా ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి.. ఇంకా వేతనాల పెంపు కోసం ఒత్తిడి వచ్చే వరకు వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధానికి త్వరలోనే ముగింపు... చమురు ధరలు దీర్ఘకాలం గరిష్ఠ స్థాయిల్లో ఉంటే ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని.. అందుకే యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకే ప్రయత్నం చేస్తాయని చెప్పుకొచ్చారు. భారత్ దగ్గర భారీ ఎత్తున చమురు శుద్ధి సామర్థ్యం సహా మిగులు విద్యుత్ ఉత్పత్తి కారణంగా ఇంధన ధరల ప్రభావాన్ని సామాన్యులపై పడకుండా తట్టుకొని నిలబడగలుగుతున్నట్లు వివరించారు. విదేశీ మారక నిల్వలు..భారత్ ఎక్కువగా చమురు విషయంలో.. దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి దిగుమతుల బిల్లు పెరిగిపోతోంది. అయితే ఇది పెరిగినప్పటికీ.. భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు సరిపడా ఉన్నాయని.. కాబట్టి మరో 3-6 నెలలు చమురు ధరలు ఇదే స్థాయిలో ఉన్నా.. భారత్ ఆ భారాన్ని మోయగల స్థితిలో ఉందని భరోసా ఇచ్చారు.