రాజస్థాన్‌పై ఓటమి తర్వాత డీలాపడ్డ పంత్.. హగ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చిన లక్నో ఓనర్ గోయెంకా!

Wait 5 sec.

గురించి క్రికెట్ లవర్స్‌కి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు. లక్నో మ్యాచ్ ఓడిపోతే ఆ తర్వాత రోజు నెట్టింట అంతా గోయెంకానే. కేఎల్ రాహుల్‌ ఫొటోతో వైరల్ అయిన గోయెంకా, రిషభ్ పంత్‌ని సైతం వదల్లేదు. అయితే.. అదంతా అప్పుడండి అన్నట్టు ఇప్పుడు . లక్నో హోం గ్రౌండ్ ఇకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ఓటమిపాలయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లో టార్గెట్ స్కోర్‌ను ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను లక్నో బౌలర్లు 159/6కే కట్టడి చేశారు. అయితే ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లను రాజస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఆయుష్ బడోనీ, , ఎయిడెన్ మార్కరమ్ డకౌట్లు కావడంతో మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మిచెల్ మార్ష్ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులతో పోరాడినప్పటికీ మిగతా ఏ బ్యాటరూ సహకరించకపోవడంతో 18 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌట్ అయింది. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు బర్గర్ రెండు, బ్రిజేశ్ రెండు, రవీంద్ర జడేజా ఒకటి, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టి లక్నో ఓటమిని శాసించారు. మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లోకి వచ్చిన గోయెంకాను కెప్టెన్ రిషభ్ పంత్ పలకరించాడు. అదే సమయంలో ఓటమితో పంత్ కాస్త డీలాపడటంతో గోయెంకా హగ్ చేసుకుని ధైర్యం చెప్పాడు. ప్రతిసారీ యాంగ్రీ మ్యాన్‌లా కనిపించే గోయెంకా.. ఈసారి ఎంతో కూల్‌గా పంత్‌ని పలకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గోయెంకా గారూ మీరు మారిపోయారు సార్.. మీరు మారిపోయారు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్‌పై ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో లక్నో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచి, ఐదు ఓడిపోయింది. నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ మైనస్‌లలో ఉండటంతో తొమ్మిదో స్థానానికి రావాల్సి వచ్చింది. గతేడాది ఐపీఎల్‌లో ఆరు గెలిచి ఎనిమిది ఓడిపోయి ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. మరి ఈ ఏడాది ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు దాదాపు పోగొట్టుకున్న లక్నో ఎన్నో స్థానంతో ముగిస్తుందో వేచి చూడాలి.