ఉద్యోగుల కనీస వేతనం రూ. 72 వేలు.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4.. 6 శాతం హైక్.. BPMS ప్రతిపాదనలు ఇవే..

Wait 5 sec.

: భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) అనుబంధ ట్రేడ్ యూనియన్ భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS).. తాజాగా 8వ వేతన కమిషన్‌కు కీలక ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్‌లో మార్పులు, ఇతర అలవెన్సులు ఎలా ఉండాలనే దానికి సంబంధించి డీటెయిల్డ్ మెమోరాండం సమర్పించింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం నెలకు రూ. 72 వేలుగా ఉండాలని ప్రతిపాదించింది. ఇది అందరి ఆర్థిక అవసరాల్ని తీర్చేలా.. సమతుల్యం చేసేలా ఉంటుందని అభిప్రాయపడింది. వేతన సంఘం అనేది ప్రతి పదేళ్లకు ఓసారి ఏర్పాటవుతుందన్న సంగతి తెలిసిందే. >> మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ) ప్రచురించిన డేటాను ఉదహరిస్తూ బీపీఎంఎస్.. ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం దేశ తలసరి నికర జాతీయ ఆదాయం 2016-17లో రూ. 1,03,219 గా ఉండగా.. ఇది 2024-25 నాటికి 86 శాతానికిపైగా పెరిగి రూ. 1,92,774 కు చేరిందని తెలిపింది. దానికి తగ్గట్లుగానే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక్కడ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4 గా ఉండాలని బీపీఎంఎస్ కోరుతోంది. 7వ వేతన కమిషన్ కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది. దీని ప్రకారమే.. మినిమం బేసిక్ పే రూ. 18 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ. 72 వేలకు చేరాల్సి ఉంటుంది. వీటితో పాటు వార్షిక వేతన పెంపు 6 శాతంగా ఉండాలని డిమాండ్ చేస్తోంది. అంతకుముందు 7వ వేతన సంఘం కింద 3 శాతంగానే ఉండేది. వేతన కమిషన్ ఏర్పాటు నుంచి 18 నెలల్లోపు కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది. అప్పటినుంచే వేతనాలు పెరగాల్సి ఉంటుంది. >> కొద్ది రోజుల కిందట (NC- JCM) కూడా తమ ప్రతిపాదనల్ని కమిషన్ ముందు ఉంచింది. ఇక్కడ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 గా ఉండాలని.. కనీస వేతనం రూ. 69 వేలకు చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక్కడ కూడా వార్షిక వేతన పెంపు 6 శాతంగా ఉండాలని.. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరింది.