కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వదలేసిన తెలంగాణ వాదాన్ని తాను మోస్తానంటూ బీఆర్ఎస్ పాత పేరు TRS పేరు వచ్చేలా పార్టీని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఆత్మను వదిలేసిందని.. పదేళ్లలో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించింది. కేసీఆర్ మన మనిషి కాదని.. మర మనిషిలా మారారని వ్యాఖ్యనించింది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేసింది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కవిత పార్టీ ఏర్పాటు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేందుకే కవితను రేవంత్ రంగంలోకి దింపారని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో ఆమె రేవంత్ రెడ్డి కేబినేట్‌లో మంత్రి పదవి కోసం ట్రై చేశారని.. ఆ విషయం తెలిసే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. వెనుక రేవంత్ రెడ్డి స్ర్కిప్ట్ ఉంటుందని.. ఆమెకు ఫండింగ్ చేసేది కూడా ఆయనేనని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. 'రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్టే కవిత చదువుతోంది. రేవంత్ రెడ్డే ఆమె తరపున పత్రికలకు పైసలు కడ్తుండు. అందుకే అన్ని పేపర్లు ఆమె పార్టీ పెట్టగానే బ్యానర్ వార్త కింద రాశాయి. టీఆర్ఎస్‌ (బీఆర్ఎస్)ను ఖతం చేయాలని రేవంత్ రెడ్డి వెనకుండి ఈ కథ నడిపిస్తుండు. కల్వకుంట్ల కవితను నా ఛాలెంజ్. మెున్న ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నాలుగో నెంబర్ కవితదే ఉండే. ఇది నిజమా.. కాదా..? కవిత చెప్పాలి. నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు.. ఆ రోజే నువ్వు కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయినవ్. మంత్రి పదవి తీసుకునేందుకు వెళితేనే.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు బయటకు వెళ్లగొట్టారు. దానికి నువ్వు ఆత్మగౌరవ పంచాయతీ అని అంటవెందుకు..?నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులకు కలిపావు. ఆ విషయం మీ అన్న, నాయిన పసిగట్టారు. నువ్వు మంత్రిగా మారటానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది. ఆ రోజు నాలుగో నెంబర్ నీదే ఉండెనా.. లేదా..? కవిత చెప్పాలి. నువ్వు ఏఐసీసీలో ఉన్న కీలక నేతతో టచ్‌లో ఉన్న మాట వాస్తవం కాదా..? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. ఈ డ్రామాలు ఎందుకు చెప్తవ్. బీసీ ప్రజలరా.. అయ్యది అయిపోయింది.. ఇప్పుడు ఈమె బయల్దేరింది. జాగ్రత్తగా ఉండండి. వీళ్లకు హలో ఇచ్చినా పాపమే. మన రక్తం తాగిన జాతులు వీళ్లవి. ఎవరికీ సానుభూతి లేదు. మన ఆత్మగౌరవం మనకు ఉండాలి.' అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. మల్లన్న చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీశాయి. నిజంగా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా..? అనే చర్చ మెుదలైంది. మల్లన్న కామెంట్లపై తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.