13 ఓవర్లలో 50 డాట్ బాల్స్.. సీఎస్కే బ్యాటింగ్‌ చూసి ఫ్యాన్స్‌కే దిమ్మతిరిగింది!

Wait 5 sec.

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కి ఫ్యాన్స్‌కే దిమ్మతిరిగిపోయింది. . గుజరాత్ టైటాన్స్‌తో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదటి 13 ఓవర్లలో ఏకంగా 50 బంతులను డాట్ చేసింది. దాంతో బ్యాటింగ్ చూసిన నెటిజన్లు ఇదెక్కడి దారుణంరా అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుని సీఎస్కేను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ముంబైపై అద్భుత విజయంతో జోష్‌లో ఉన్న సీఎస్కే, ఈ మ్యాచ్‌లో ఇరగదీస్తుంది అని అనుకున్నారు. కానీ సంజూ శాంసన్ ఆరంభంలోనే అవుటవ్వడంతో చెన్నై మళ్లీ పాత సీనే రిపీట్ చేసింది. తొలి మూడు ఓవర్లలో 21 పరుగులు చేసిన సీఎస్కే 13 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 66 పరుగులే చేసింది. పవర్ ప్లేలో దారుణంగా 28 పరుగులు మాత్రమే చేసింది.ఒకానొక దశలో సీఎస్కే కెప్టెన్ 32 బంతుల్లో కేవలం 19 పరుగులే చేశాడు. అంటే ఆ సమయానికి చెన్నై 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దాంతో జట్టును ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చింది. తానే ఎక్కువ స్ట్రయికింగ్ ఉండటంతో సీఎస్కే సింగిల్స్‌కి పరిమితమైంది. ఆ తర్వాత రుతురాజ్ తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను 158 పరుగులకు చేర్చాడు. 60 బంతులు ఆడిన కెప్టెన్ రుతురాజ్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన గైక్వాడ్ ఆఖరి వరకూ క్రీజులో ఉండి నాటౌట్‌గా నిలవడం విశేషం. సీఎస్కే తొలి 13 ఓవర్లు ఇలా సాగాయిమొహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో వరుసగా ఐదు డాట్స్ రావడంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. రెండో ఓవర్‌లో మూడు డాట్ బాల్స్, మూడో ఓవర్‌లో మూడు, నాలుగో ఓవర్‌లో మూడు, ఐదో ఓవర్‌లో నాలుగు, ఆరో ఓవర్‌లో నాలుగు, ఏడో ఓవర్‌లో మూడు, ఎనిమిదో ఓవర్‌లో మూడు డాట్ బాల్స్‌కి తోడు ఒక లెగ్‌బై ఉంది. తొమ్మిదో ఓవర్‌లో మూడు డాట్ బాల్స్, పదో ఓవర్‌లో నాలుగు డాట్ బాల్స్, 11వ ఓవర్‌లో నాలుగు డాట్ బాల్స్, ఒక లెగ్ బై. 12వ ఓవర్‌లో నాలుగు డాట్ బాల్స్, 13వ ఓవర్‌లో 3 డాట్ బాల్స్ ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్ 46 బంతుల్లో 87 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 33 పరుగులు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన కగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.