: కొత్త ఆర్థిక సంవత్సరంలో (2026-27) ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సమయం ఆసన్నమైంది. 2025-26 లో ఆర్జించిన ఆదాయంపై.. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (మదింపు సంవత్సరం) ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటిన వారికి . చాలా సందర్భాల్లో చిన్న చిన్న నిర్లక్ష్యం, లెక్కల్లో పొరపాట్లు చేయడం, లేదా పూర్తి సమాచారం లేకపోవడం వల్ల ఆదాయాన్ని తప్పుగా రిపోర్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ కొందరు పన్ను బాధ్యత నుంచి తప్పించుకోవాలని కూడా ఐటీ రిటర్న్స్‌లో ఆదాయాన్ని తప్పుగా చూపుతుంటారు. కొందరికి ఇది చాలా చిన్న విషయంగానే అనిపించినప్పటికీ.. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన. ముఖ్యంగా కొత్త ఆదాయపు పన్ను చ్టటం- 2025 ప్రకారం.. ఆదాయం తప్పుగా చూయిస్తే కనీసం 50 శాతం నుంచి గరిష్ఠంగా 200 శాతం వరకు జరిమానా పడుతుంది. ఇక్కడ కొన్ని తేడాలు ఉంటాయి. అజాగ్రత్త వల్ల జరిగిన పొరపాటు (అండర్ రిపోర్టింగ్), ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు (మిస్ రిపోర్టింగ్). ఇదే పెనాల్టీని నిర్ణయిస్తుంటుంది. ప్రభుత్వం.. ఇక్కడ కొన్ని షరతులతో పెనాల్టీ నుంచి మినహాయింపు పొందే అవకాశాన్ని కూడా కల్పించింది. వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. అండర్ రిపోర్టింగ్ అంటే.. సాధారణంగా అనుకోకుండా చేసే తప్పిదంగా చెప్పొచ్చు. కొన్ని ఆదాయ వనరుల్ని చూపించకపోవడం, డిడక్షన్స్ తప్పుగా చూపడం, లెక్కల్లో పొరపాట్లు చేయడం వంటివి ఉంటాయి. ఇక్కడ చెల్లించాల్సిన పన్నుపై 50 శాతం పెనాల్టీ పడుతుంది. మిస్ రిపోర్టింగ్ అంటే టాక్స్ పేయర్లు.. ఉద్దేశపూర్వకంగా చేసే తప్పిదం. ఇక్కడ ఆదాయాన్ని పూర్తిగా దాచడం, ఇంకా నకిలీ ఖర్చులు చూయించి టాక్స్ రిఫండ్ పొందడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పెట్టుబడులు దాచిపెట్టడం వంటివి ఉంటాయి. ఇక్కడ 200 శాతం వరకు పెనాల్టీ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించాల్సిన పన్నుపై పెనాల్టీ ఉంటుంది. అయితే పెనాల్టీ నుంచి బయటపడేందుకు కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. మీరు తప్పును స్వయంగా ముందే ఒప్పుకుంటే అసలు టాక్స్ చెల్లించాలి. వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 100 శాతం టాక్స్ చెల్లించాలి. దీంతో ఇక్కడ 200 శాతం వరకు పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు. కోర్టు కేసుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇటీవల ఐటీ శాఖ.. చిన్న చిన్న పొరపాట్లను కూడా సహించట్లేదు. ఇంకా అన్ని వివరాల్ని కనిపెడుతుంది. ఇందుకోసం కొత్త కొత్త టెక్నాలజీల్ని ఉపయోగిస్తుంది. అందుకే. ఐటీఆర్ ఫైలింగ్‌లో చిన్న నిర్లక్ష్యం కూడా చాలా విలువతో కూడుకున్నదని చెప్పొచ్చు.