రూ.22 వేలు కడితే.. నెలకు రూ.25 లక్షల ఆదాయం.. నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ సూచించారా? అసలు నిజం ఇది

Wait 5 sec.

Fact Check: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెట్టుబడి ప్లాట్‌ఫారంలో పొందవచ్చని ఆమె సూచిస్తున్నట్లు వీడియో ఉంది. సూపర్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ అంటూ ప్రమోట్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ సంస్థ బయటపెట్టింది. అలాంటి ప్లాట్‌ఫారాలను నమ్మని పెట్టుబడి పెట్టవద్దని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ డీప్ ఫేక్ వీడియో అని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి అలాంటి ప్రమోషన్లు ఏమీ చేయలేదని స్పష్టం చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఫేక్ న్యూస్‌గా చెబుతూ ఓ పోస్ట్ చేసింది. 'సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో కేంద్ర ఆర్థిక మంత్రి ఒక పెట్టుబడి వేదికను ప్రచారం చేస్తున్నట్లు ఉంది. రూ. 22,000 ప్రారంభ డిపాజిట్‌తో నెలకు రూ.25-30 లక్షల గ్యారెంటీ ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. ఈ వీడియో నకిలీది, ఏఐ (AI) ద్వారా సృష్టించారు. భారత ప్రభుత్వం గానీ, ఆర్థిక మంత్రి గానీ అటువంటి పెట్టుబడి వేదికను లేదా పథకాన్ని ఆమోదించ లేదు.'- అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రాసుకొచ్చింది.అలాంటి వాటిని ఇతరులకు పంపించే ముందు అధికారిక వెబ్‌సైట్లు లేదా మూలాల ద్వారా సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని ప్రజలకు పీఐబీ కీలక సూచనలు చేంది. ప్రజలు ఇలాంటి వాటిపట్ల జగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సైతం హెచ్చరించింది. ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి స్కీమ్స్‌ను సైబర్ నేరగాళ్లు ప్రమోట్ చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థలోని కీలక వ్యక్తుల వీడియోలను మార్ఫింగ్ చేసి ఇలా వైరల్ చేస్తున్నట్లు తెలిపింది.మరోవైపు.. కొత్త పథకం తీసుకొచ్చారని,అందులో రూ.22 వేలు పెట్టుబడి పెడితే వారానికి రూ.5.5 లక్షలు పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ అయింది. అయితే, ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐతో జనరేట్ చేశారని పీఐబీ తెలిపింది. అది ఒక ప్రమాదకరమైన స్కామ్ గా తెలిపింది. అలాగే ఇలాంటి ఫేక్ న్యూస్ గుర్తిస్తే వివిధ ప్రభుత్వ ఛానళ్ల ద్వారా రిపోర్ట్ చేయాలని పీఐబీ తెలిపింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కి రిపోర్ట్ చేసేందుకు వాట్సాప్ నంబర్ 8799711259 లేదా ఇ-మెయిల్ ద్వారా అయితే factcheck@pib.gov.in ద్వారా నివేదించవచ్చని తెలిపింది.