‘డార్లింగ్’ రీ-రిలీజ్‌లో రచ్చ.. ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ సిబ్బంది దాడి.. వీడియో వైరల్

Wait 5 sec.

రెబల్ స్టార్ 'ది రాజాసాబ్' సినిమాతో నిరాశ పరిచారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. 'కల్కి 2898 ఏడీ' తర్వాత తమ అభిమాన హీరో ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడుతుందని అనుకుంటే, డిజాస్టర్ పడిందని ఫీల్ అవుతున్నారు. దాన్ని మార్చిపోడానికి వీలైనంత త్వరగా ప్రభాస్ నెక్స్ట్ మూవీని బరిలోకి దింపాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో, 'డార్లింగ్' రీ-రిలీజ్ వారిలో నూతనోత్సవం నింపింది. అయితే థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ సిబ్బంది దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ప్రభాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డార్లింగ్'. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2010 ఏప్రిల్ 23న రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ.. మంచి విజయం సాధించింది. సినిమా వచ్చి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బుధవారం రీ- రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ప్రభాస్ వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తి కనబరిచారు.* హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్ లో 'డార్లింగ్' సినిమాని ప్రదర్శించారు. అయితే సాంగ్ విషయమై థియేటర్ యాజమాన్యంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి గొడవ జరిగిందట. ఒక షోలో సాంగ్ వేసి, మరో షోలో వేయకపోవడంతో అభిమానులు అభ్యంతరం తెలిపారట. ఈ క్రమంలో పాటని ప్రదర్శించాలని అడిగిన ఓ అభిమానిపై థియేటర్ సిబ్బంది దాడి చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్లో ఏదైనా జరిగితే యాజమాన్యం సరిదిద్దాలే కానీ గొడవలకు దిగడం సరికాదని, ప్రేక్షకుల కారణంగానే థియేటర్లు నడుస్తాయని, ఇలాంటి ఘటనల వల్ల జనాలు సినిమా హాళ్లకు దూరమవుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ గొడవ జరిగింది సాంగ్ కోసం కాదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్ తాగొచ్చి అక్కడ పనిచేసే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అందుకే అతడిని కొట్టారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.. థియేటర్లో ఒక ప్రేక్షకుడిపై ఒకతను కర్రతో దాడి చేసిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. *