రాష్ట్రంలో పెరుగుతన్న ఆర్టీసీ డ్రైవర్ల ఆత్మహత్యాయత్నాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Wait 5 sec.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. కుటుంబ సభ్యులను తీరని శోకాన్ని మిగిల్చవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఇవాళ సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరించారు. , డిమాండ్లు, సమస్యలను పరిష్కరించే అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజున ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చించాలని ఈ సందర్భంగా మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం.. రేపు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఇక ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి బాధ్యత ఉందని పేర్కొన్నారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని అందుకు కొంత ఆలస్యమైందని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసినట్లు చెప్పారు. శుక్రవారం రోజున జేఏసీ నేతలతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగాలు తీసివేస్తారనే ప్రచారం సరైందని కాదని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగిందని మరో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడి.. ప్రాణాలు తీసుకోవడం అనేది బాధాకరమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. తమది ప్రజా పాలన అని.. ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వమని తేల్చి చెప్పారు. క్షణికావేశం వల్ల అనర్థాలు జరుగుతాయని.. ప్రేరేపిత చర్యలు వద్దని హితవు పలికారు. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దని వెల్లడించారు. కార్మికుల కుటుంబాలకు వారి అండ అవసరమని.. కేబినెట్ భేటీ కంటే ముందే ఆర్టీసీ గురించి చర్చించినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం.. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రాణత్యాగాలకు సిద్ధపడిన వేళ.. ఈయూ ఆఫీస్‌లో ఆర్టీసీ జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న, వైస్‌ ఛైర్మన్‌ థామస్‌రెడ్డి.. సమ్మె తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు మౌన ప్రదర్శన చేపట్టాలని పేర్కొన్నారు. ఆ తర్వాత 25న అన్ని డిపోల్లో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక 26న జిల్లాల్లో ఆర్టీసీ సంఘాల కార్మిక కవాతు చేపట్టనున్నారు. 27న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేసి.. అన్ని డిపోల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇక 29న డిపోల ముందు ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శనలు ఉంటాయని వివరించారు.