ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ చెరపని రికార్డును రాశాడు శ్రేయాస్ అయ్యర్. ఇప్పటి వరకు ఏ కెప్టెన్‌కు సొంతం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు సర్పంచ్ సాబ్. ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీకి దూరమైన పంజాబ్‌ను ఈ ఏడాది తిరుగులేని శక్తిగా నిలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే వరుసగా ఇన్ని విజయాలు గెలిచిన కెప్టెన్ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ 2026 సగం సీజన్ పూర్తయింది. దాదాపు ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్తాయి.. ఏ జట్లు ఇంటిదారి పడతాయి అన్న క్లారిటీ ఈ పాటికే అందరికీ వచ్చి ఉంటుంది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రెండు పరాజయాలతో ఉండగా.. పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచిన జట్టుగా పంజాబ్, కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు సృష్టించారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడితే ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఒక్క మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటి వరకు ఏ జట్టు, ఏ కెప్టెన్ కూడా ఈ అరుదైన రికార్డును అందుకోలేకపోయారు. ఆరు మ్యాచ్‌లలో ప్రదర్శన ఇలా..పంజాబ్ కింగ్స్ గెలిచిన ఆరు మ్యాచ్‌లలో కూడా ఆ జట్టుదే డామినేషన్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రం తడబడిన సర్పంచ్ సాబ్ టీమ్ ఆ తర్వాత ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 162/6కే కట్టడి చేసినా.. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆఖరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది. సీఎస్కేపై 210 టార్గెట్‌ను 18.4 ఓవర్లలో ఛేదించింది. సన్‌రైజర్స్‌పై కూడా 220 టార్గెట్‌ను 18.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. ముంబై ఇండియన్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ముంబై 196 పరుగుల టార్గెట్ ఇస్తే, కేవలం 16.3 ఓవర్లలోనే ఊదేసింది. లక్నోపై 254 పరుగులు చేసి ఆ జట్టును 200 పరుగులకే కట్టడి చేసింది. ఇక చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై రికార్డు బ్రేకింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఢిల్లీ ఈ మ్యాచ్‌లో 264 పరుగులు చేస్తే.. అసాధ్యమైన టార్గెట్‌ను కేవలం 18.5 ఓవర్లలో ఛేదించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అన్ని మ్యాచ్‌లలోనూ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.