జియో నుంచి మరో కొత్త ప్లాన్.. రోజుకు 2GB డేటా+ అదనంగా 5జీబీ.. గేమర్స్‌ కోసం స్పెషల్ బెనిఫిట్స్

Wait 5 sec.

Jio Recharge: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా గేమ్స్ వాడే వారి కోసం ఈ కొత్త ప్లాన్ డిజెన్ చేసినట్లు జియో తెలిపింది. యూత్ అండ్ గేమింగ్ ప్లాన్ ()ను పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 61 జీబీ డేటా లభిస్తుందని పేర్కొంది. అంతే కాదు జియో గేమ్స్, గూగుల్ జెమినీ యాక్సెస్, స్నాప్ చాట్ ప్లస్ వంటి పలు అదనపు ప్రయోజనాలను అందిస్తోందని తెలిపింది. ముఖ్యంగా గేమర్స్, యూత్ ను ఆకర్షించే విధంగా ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ రూపొందించినట్లు తెలిపింది. గేమర్స్ కోసం కొత్త ప్లాన్గేమర్స్ కోసం రిలయన్స్ జియో రూ.459తో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ హైస్బీడ్ డేటా మొత్తం 28 రోజులకు 61 జీబీ లభిస్తుంది. అలాగే అదనంగా మరో 5 జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు అన్‌లమిటెడ్ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సైతం లభిస్తాయి. మై జియో యాప్ లో జియో గేమ్స్ తో పాటు క్లౌడ్ గేమింగ్ యాకెస్స్ స్నాప్ చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ సైతం ఉచితంగానే లభిస్తుంది. జియో హాట్ స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు ఉచితంగా వస్తుంది. వీటన్నింటితీ పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. కేవలం నెట్ వర్క్ ప్రొవైడర్ గానే కాకుండా డిజిటల్ సేవల రంగంలో ఒక గ్లోబల్ పవర్ హౌస్ గానూ అవతరించింది. జియో తన 9వ వార్షికోత్సవంగా సందర్భంగా 50 కోట్ల యూజర్ల మార్క్ దాటినట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2026 నాటికి జియో మార్కెట్ వాటా మరింత పెరిగి టెలికాం రంగంలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ప్రస్తుతం దేశంలో జియోకు 26.8 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. జియో నెట్ వర్క్స్ లో సగటు డేటా వినియోగం నెలకు 42.3 జీబీకి పెరిగింది. 5జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడంతో పాటు ఎయిర్‌టెల్ తో కలిసి 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై జియో దృష్టి సారించింది.