టీచర్ల కనీస వేతనం రూ.50,000.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83.. ఉద్యోగ సంఘాల కీలక ప్రతిపాదనలు!

Wait 5 sec.

8th CPC: ఉద్యోగుల కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటివి నిర్ణయించేందుకు 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్ (PSNM) అనే కేంద్ర ప్రభుత్వ టీచర్ల ప్రతినిధిగా ఉన్న ఉద్యోగుల సంఘం కీలక ప్రతిపాదనలు పంపించింది. గ్రూప్ డీలోని ఉపాధ్యాయులకు 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 ఇవ్వాలని కోరింది. పీఎస్ఎన్ఎం అనేది ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు (AINPSEF) అనుబంధంగా పని చేస్తోంది. తమ ప్రతిపాదనలు ఏప్రిల్ 20, 2026 రోజునే 8వ పే కమిషన్‌కు మెమోరండం అందించింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లోని ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేసింది.లేవల్ 1 ఉద్యోగుల కనీస వేతనం రూ.50,000 ఉండాలని ప్రగతిశీళ శిక్షక్ న్యాయ్ మంచ్ డిమాండ్ చేస్తోంది. అయితే లెవల్ 6 ఉద్యోగి అయిన ఎంట్రీ లెవల్ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయునికి కనీస మూల వేతనం రూ.1,34,500 ఉండాలని డిమాండ్ చేస్తోంది. అలాగే వీటితో పాటు టీచర్ల హౌస్ రెంట్ అలవెన్స్ 36 శాతానికి పెంచాలని, యాన్యువల్ ఇంక్రిమెంట్ 7 శాతం వరకు ఉండాలని కోరింది. డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరినప్పుడు బేసిక్ పేలో విలీనం చేయాలని కోరింది. అలాగే పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని, ఉద్యోగికి కనీసం 6, 12,18,24 ఏళ్ల సర్వీసు కాలంలో ప్రమోషన్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.7వ వేతన సంఘం ప్రకారం లెవల్ 1 ఉద్యోగి కనీస వేతనం రూ.18 వేలుగా ఉంది. 7వ సీపీసీలో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఇచ్చారు. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ 3 శాతంగా ఉంది. అయితే, ఈసారి దానిని భారీగా పెంచాల్సిందేనని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం అసలు డెసిమల్ పాయింట్లను లెక్కలోకి తీసుకోవడం లేదని తెలిపింది. 50 శాతానికి చేరినప్పుడు బేసిక్ వేతనంలో విలీనం చేయాలంది. అలాగే 8వ వేతన సంఘంలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ నెలకు రూ.2812.59 నుంచి రూ.7 వేలకు పెంచాలని, ఒక్కో పిల్లవానికి ఇది ఉండాలని కోరింది. గ్రాడ్యుయేషన్ లెవల్ వరకు కల్పించాలని కోరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ టీచర్లకు సీఈఏ 12వ తరగతి వరకు మాత్రమే వస్తోంది.