Infra Stock: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఇన్ఫ్రా సెక్టార్ కంపెనీ సన్మిట్ ఇన్ఫ్రా లిమిటెడ్ () బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. చేపట్టేందుకు ఆమోదం తెలుపారు. ఇందుకు అయితే ఈ ఏప్రిల్ 30కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. రికార్డ్ తేదీ రోజున ఈ కంపెనీ షేర్లు రివర్స్ ఎక్స్-స్ప్లిట్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ఈ రోజు షేరు ధర ఒక్కసారిగా 10 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం రూ.7 వద్ద ఉన్న ఈ స్టాక్ ధర రూ.70కి పేగా పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో షేర్ల సంఖ్య తగ్గనుంది. మరి ఈ స్టాక్ స్ప్లిట్ గురించిన వివరాలు తెలుసుకుందాం. రివర్స్ స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి?రివర్స్ స్టాక్ స్ప్లిట్ అంటే కార్పొరేట్ యాక్షన్స్ లోని ఒక భాగం. కంపెనీ మొత్తం షేర్ల సంఖ్యని తగ్గించి షేర్ ధరను అమాంతం పెంచుతుంది. ఈ రివర్స్ స్టాక్ స్ప్లిట్ సాధారణ స్టాక్ స్ప్లిట్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణ స్టాక్ స్ప్లిట్ ద్వారా ఒక షేరును అనేక షేర్లుగా విభజిస్తారు. అయితే రివర్స్ స్టాక్ స్ప్లిట్లో పలు షేర్లను కలుపుతూ ఒక షేర్ గా కన్సాలిడేట్ చేస్తారు. ఈ రివర్స్ స్టాక్ స్ప్లిట్ అమలు చేయడంతో కంపెనీలు తమ లిస్టింగ్ అవసరాలకు అనుగుణంగా షేర్ స్ట్రక్చర్ మార్చుతాయి.ఆమోదం లభించింది. దీని అర్థం రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లను రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 1 ఈక్విటీ షేరుగా మెర్జ్ చేస్తారు. అలాగే ఈ రివర్స్ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ ఏప్రిల్ 30, 2026గా కంపెనీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో సన్మిట్ ఇన్ఫ్రా లిమిటెడ్ షేరు 0.83 శాతం నష్టంతో రూ. 7.16 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 12 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 4.85 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 9 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 33 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 22 శాతం నష్టపోయింది. ఏడాది కాలంలో 27 శాతం పడిపోయింది. గత ఐదు సంవత్సరాలలో 17 శాతం నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 113 కోట్ల వద్ద ఉంది.