టాలీవుడ్ డైరెక్టర్‌తో వియ్యమందుకుంటున్న బీఆర్ఎస్ లీడర్.. వేడుకలో చిరంజీవి, కేటీఆర్..

Wait 5 sec.

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్‌తో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వియ్యమందుకుంటున్నారు. తోట చంద్రశేఖర్ కుమారుడు, కుమార్తెకు వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, సినీ నటుడు చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తోట చంద్రశేఖర్‌కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జనసేన పార్టీలోనూ గతంలో పనిచేశారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్.. 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తోట చంద్రశేఖర్.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకంగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జనసేన పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్.. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో జనసేనకు దూరమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే కేసీఆర్ ఆలోచనతో.. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియమితులయ్యారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆలోచన పక్కనబెట్టారు. దీంతో అప్పటి నుంచి తోట చంద్రశేఖర్ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇటీవలే డిప్యూటీ సీఎం ఆయన తిరిగి జనసేనలో చేరతారనే వార్తలు వచ్చాయి. అయితే కుమారుడి నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు తోట చంద్రశేఖర్ వెళ్లినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే చిరంజీవి హాజరు కావటం, కేటీఆర్‌తో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.