రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌తో మీ డబ్బులు డబుల్.. పూర్తి వివరాలివే!

Wait 5 sec.

: మధ్యతరగతి ప్రజలు ఏ విషయంలోనైనా భద్రత గురించి ఆలోచిస్తారు. ఇక డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కష్టపడి సంపాదించిన సొమ్ముకు గ్యారెంటీ రిటర్న్స్ ఉండే పథకాలనే ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం అని చెప్పవచ్చు. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఈ స్కీమ్ ద్వారా మెరుగైన రాబడి పొందవచ్చు. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత రెట్టింపు మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు ఎలా?తమ డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందని పెట్టుబడిదారులు ఆలోచిస్తారు. పథకంలో ప్రస్తుతం 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇస్తోన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడి సరిగ్గా 115 నెలల్లో (అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో) డబుల్ అవుతుంది. మీరు ఇందులో రూ.5 లక్షలు పెడితే, 115 నెలల తర్వాత చేతికి రూ.10 లక్షలు వస్తాయి. అలాగే రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షలు అందుకోవచ్చు. ఇందులో గరిష్ఠ పరిమితి అంటూ ఏది లేదు కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో చేరడం చాలా సులభం. భారతీయ పౌరులు ఎవరైనా సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి కిసాన్ వికాస్ పత్రం కొనుగోలు చేయవచ్చు. ఒంటరిగా లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ ఖాతా కూడా తెరవవచ్చు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరుపైన కూడా ఈ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కేవలం రూ.1,000తో అకౌంట్ తీసుకోవచ్చు. నగదు లేదా చెక్కు రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు వేరే ఊరికి మారితే మీ కేవీపీ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. పెట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాలు పూర్తయితే మీరు ఎప్పుడైనా విత్ డ్రా చేయవచ్చు. మెచ్యూరిటీ వరకు ఉంటేనే మీడబ్బు రెట్టింపు అవుతుందని గుర్తుంచుకోవాలి. డబ్బు అవసరమైతే కేవీపీ సర్టిఫికేట్‌ను తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ కూడా తీసుకోవచ్చు. దీంతో మీ పెట్టుబడి కొనసాగుతూనే మీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్క్ తీసుకోలేమమనుకునే వారికి తమ రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర మంచి అవకాశంగా చెప్పవచ్చు.