ఆంధ్రప్రదేశ్‌లోఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫుల్ స్టాప్ పెట్టారు. లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంధన సరఫరాలో వచ్చిన లోపాలు, సమస్యల కారణంగానే కొన్నిచోట్ల పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లోటు లేదని.. ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు ఇంధన లభ్యతపై ప్రజలకు సమాచార, ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఇంధన సరఫరాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే.. వెంటనే పరిష్కరించాలని సూచించారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరత వార్తల నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టిస్తున్నారనే విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆయిల్ సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా, సరఫరా చైన్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. చమురు డిపోలను జేసీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని.. ప్రైవేట్‌ చమురు కంపెనీల డిపోలు, అవుట్‌లెట్‌లనూ తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.మరోవైపు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంధన కొరత వార్తల నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద గొడవలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకోసం పోలీసులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్లకు తరలకుండా నిఘా పెంచాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ లభించకపోవటంతో వాహనదారులతో పాటుగా ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, దీంతో పలుచోట్ల డ్రమ్ముల్లో నింపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల నిర్వాహకులు పరిమితంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం.