విశాఖపట్నం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వడ్లపూడి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఆటోనగర్‌- దువ్వాడ మార్గంలో ఆర్వోబీ వంతెన నిర్మిస్తున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆర్‌వోబీ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుంగలం, దువ్వాడ మార్గంలో గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆర్వీబీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఆదివారం ప్రమాదం జరిగిన సమయంలో పదిమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఏడుగురు గాయపడ్డారు. ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. నలుగురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.