Tamil Nadu: డీఎంకేదే విజయమన్న పలు సర్వేలు.. విజయ్‌ సునామీ తథ్యమని ఓ సంస్థ జోస్యం

Wait 5 sec.

దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. మెజార్టీ సంస్థలు అధికార () మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్నాడీఎంకే ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఎంకే స్టాలిన్‌ నాయకత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ విజయం ఖాయమని ఢంకా బజాయించాయి. ఇక, తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నటుడు, దళపతి విజయ్‌ పార్టీ టీవీకేకి రెండంకెల సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పాయి. మూడో స్థానానికే విజయ్ పరిమితమని అంచనా వేశాయి. అయితే, మే 4న వెలువడే అసలు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇండియా టూడే మైయాక్సిస్ సర్వే మాత్రం విజయ్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఆ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు, డీఎంకే కూటమికి 92 నుంచి 110, అన్నాడీఎంకేకు 22 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పడం గమనార్హం.మ్యాట్రిజ్‌ సంస్థ అంచనా ప్రకారం డీఎంకే కూటమి 122 నుంచి 132, అన్నాడీఎంకే కూటమి 87 నుంచి 100, విజయ్ పార్టీ టీవీకే 10 నుంచి 12, ఇతరులు 0 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో డీఎంకే కూటమి 125 నుంచి145, అన్నాడీఎంకే అలయెన్స్ 65 నుంచి 80, టీవీకే 18 నుంచి 24 ఇతరులు 0-6 స్థానాల్లో విజయం తథ్యమని తెలిపింది. పీ-మార్క్‌ డీఎంకే 125 నుంచి 145, అన్నాడీఎంకే 65 నుంచి 85, టీవీకే 16 నుంచి 26, ఇతరులు 1 నుంచి 6 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ కూడా డీఎంకే కూటమికే అధికారం దక్కుతుందని పేర్కొంది. స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే 120 నుంచి 140, అన్నాడీఎంకే కూటమి 60 నుంచి 70, విజయ్ 30-40, ఇతరులు 4 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు వివరించింది.