‘బేబీ’తో హిట్‌పెయిర్‌గా నిలిచిన ఆనంద్‌ దేవరకొండ - వైష్ణవీ చైతన్య మరోసారి ‘ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌’ (Epic)లో కలిసి నటిస్తున్నారు. ‘#90s: ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీ టీజర్‌ బుధవారం విడుదలైంది మాట్లాడుతూ.. “ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుతున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు.” అన్నారు. ‘ఎపిక్’ ఈవెంట్ కి రష్మిక వదినమ్మని కూడా పిలుస్తానని.. లాస్ట్ టైం ఫుల్ ఏడిపించారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “ముందుగా ‘సంచారమే’ పాటపై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఎపిక్ కథ నాకు చాలా నచ్చింది. కథ వినగానే నేను ఈ సినిమాలో భాగం కావాలి అనుకున్నాను. నేను పోషించిన కడలి పాత్ర చాలా బాగుంటుంది. కథ వినేటప్పుడు ఆ కడలి నాలో ఉందేమో అనిపించింది. చాలామంది అమ్మాయిల్లో ఆ కడలి ఉంటుంది అనిపించింది. ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర కూడా బాగుంటుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఎపిక్ నా మనసుకి దగ్గరైన సినిమా. ఇదొక అందమైన ప్రేమ కథ. మనల్ని మనం చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మన స్నేహితులు గుర్తుకొస్తారు. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.