ఎవరేమనుకున్నా పర్లేదు.. ఇదే రియాలిటీ.. డబ్బులు కావాలంటే ఏదోటి చేయాలి కదా.. అది చేస్తే తప్పేంటి?: అంబటి అర్జున్

Wait 5 sec.

అంటే ‘దేవత’ సీరియల్ గుర్తొస్తుంటుంది కానీ.. అర్థనారి సినిమా గుర్తుకురాదు. అదే సినిమాకి సీరియల్‌కి ఉన్న తేడా. ఎప్పుడో 2016లో అర్థనారి అనే సినిమా చేశారు అంబటి అర్జున్. ఆ సినిమా బాగానే ఆడింది కానీ.. ఆ తరువాత మళ్లీ సీరియల్స్, టీవీ షోలు, బిగ్ బాస్‌తోనే పాపులర్ అయ్యారు అంబటి అర్జున్. అయితే ఇప్పుడు మళ్లీ ‘’ అనే చిత్రంలో హీరోగా నటించారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబటి అర్జున్. ‘‘ఇంతకుముందు చాలా సినిమా ఈవెంట్‌లలో పాల్గొన్నాను. కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ముగ్గురు దిగ్గజాలు.. సముద్ర గారు, వీరశంకర్ గారు, భీమనేని శ్రీనివాస్ గారు సినిమాలు చేస్తున్నప్పుడు నేను బజ్జాగాడ్ని. వాళ్ల సినిమా టికెట్‌లకోసం లైన్‌లలో కుస్తీలు పడ్డవాడ్ని. అప్పట్లో థియేటర్స్ వైభవమే వేరు. అలాంటి గొప్ప దర్శకులతో నేను స్టేజ్ షేర్ చేసుకున్నానంటే.. అది నా అదృష్టం. సముద్రగారితో సినిమా చేయాల్సి ఉంది కానీ.. మిస్ అయ్యింది. ఇప్పుడు నేను చేసిన ఈ పరమపద సోపానం సినిమా ఈవెంట్‌కి నాకు ఎంతో ఇష్టమైన ఈ దర్శకులంతా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా కష్టపడి చేస్తే మంచి ఔట్ పుట్ వచ్చింది. ఇరగదీసి చేశాం.. సినిమా సూపర్ హిట్టూ అని నేను చెప్పను కానీ.. మంచి ప్రయత్నం చేశాం.. ఆ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. ఫైనాన్షియల్‌గా నేను పెద్ద స్ట్రాంగ్ కాదు. ఇండస్ట్రీలో ఉండాలంటే ఏదొక సపోర్ట్ కూడా అవసరం. అర్థనారి సినిమా తరువాత చాలా ప్రయత్నాలు చేశాను. వచ్చినవి వచ్చినట్టు చేసుకుని వెళ్లాను. అప్పుడు మళ్లీ సీరియల్స్ ఛాన్స్ వచ్చాయి.. ఫైనాన్షియల్‌గా నిలబడటానికి టీవీ షోలు చేశాను. ఇప్పుడు ఆర్థికంగా పర్లేదు అని అనుకున్నప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. బిగ్ బాస్‌కి అంతకుముందు కూడా నాకు ఛాన్స్‌లు వచ్చాయి. ఒకసారి ట్రై చేద్దాం అని నేను కూడా వెళ్లాను. బిగ్ బాస్‌కి వెళ్తే.. లైఫ్ టర్న్ అయిపోతుందని అనను కానీ.. లైఫ్‌లో కాస్త వైల్డ్ అపర్చ్యునిటీ వస్తుంది. చాలామందికి వచ్చింది. నేను కూడా అందుకే వెళ్లాను. లైఫ్‌లో ఎవరైనా పైకి వెళ్లాలనే చూస్తారు.. అయినా సినిమా వేరు.. రియాలిటీ వేరు. రియాలిటీలో ఏమి చేయలేనప్పుడు ఏది వస్తే అది చేయాలి. సినిమాలో నా గ్రోత్ బావుంటే నేను సినిమాలు చేసుకుంటాను. లేదూ.. బాలేదంటే ఎదొస్తే అది చేసుకుంటాను. అవకాశాన్ని బట్టి వీడు అటూ ఇటూ మాట్లాడుతున్నాడని అనుకోవద్దు.. రియాలిటీలో ఉందాం. సినిమాలో నా కెరియర్ బావుంటే సినిమాల్లో ఉంటా. బాలేదంటే.. నేను ఏదొక పని చేసుకోవాలి కదా.. కాబట్టి టీవీకి వస్తాను. అది స్వార్థం అనుకున్నా.. ఏమనుకున్నా కూడా.. ఇదే రియాలిటీ. అవకాశాలు లేవన్నప్పుడు దొరికిన పని చేసుకోవడంలో తప్పు లేదు కదా’ అంటూ చెప్పుకొచ్చారు అంబటి అర్జున్.