VI Mobile Recharge: ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ యూజర్లకు సడెన్ ఝలక్ ఇచ్చింది. తమ మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఈ రీఛార్జ్ ధరల పెంపు స్వల్ప మొత్తంలోనే ఉంటుందని, పెద్ద మొత్తంలో అయితే భారం మోపడం లేదని స్పష్టం చేసింది. ఇటీవలే మరో ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టారిఫ్ ధరలను 4-5 శాతం మేర పెంచింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా అదే దారిలో నడుస్తూ టారిఫ్ ధరలను పెంచుతామని వెల్లడించింది. అయితే, ఎంత వరకు ఈ పెంపు ఉండనుందనే విషయంపై క్లారిటీ లేదు. ఎయిర్‌టెల్ తో పోలిస్తే ఈ పెంపు స్వల్పంగా ఉంటుందని చెప్పవచ్చు. టెలికాం కంపెనీలు ఈ సంవత్సరం 15 శాతం మేర రీఛార్జ్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని టెలికాం అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్ 4-5 శాతం ధరలు పెంచడంతో మొబైల్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 15 శాతం పెంపు అంటే భారీగా భారం పడనుంది. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ఆధ్వర్యంలో నిర్వహించిన డిజికామ్ సమ్మిట్ లో వొడాఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టారిఫ్ ధరలను స్వల్ప మొత్తంలో పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. కంపెనీ పని తీరు ప్రస్తుతం మెరుగవుతున్నట్లు తెలిపారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ అభిజిత్ కిశోర్ వెల్లడించారు. ప్రస్తుత కంపెనీ పనితీరుపై పూర్తి నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారీగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను వొడాఫోన్ ఐడియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మార్చి, 2026 నెలలో లక్ష మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.ఎయిర్‌టెల్ ఛార్జీల పెంపు4 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ల ధరలు మరింత భారం అయ్యాయి. రూ.859కి లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.899కి పెంచింది. యూజర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ధరలను సవరించడం గమనార్హం. దీంతో ఈ ప్లాన్ రెగ్యులర్ గా రీఛార్జి చేసుకునే వారిపై అదనంగా రూ.40 భారం పడినట్లయింది. అయితే, కొత్త ప్లాన్ లో ఎలాంటి అదనపు ప్రయోజనాలు కూడా కల్పించకపోవడం గమనార్హం. ఈ ప్లాన్ ద్వారా రోజు 1.5 జీబీ హైస్బీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీ వంటివి లభిస్తాయి.