: దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీలన్నీ వరుసగా 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి- మార్చి Q4) ఫలితాల్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫలితాలు విడుదల చేయగా.. తర్వాత వరుసగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా కూడా ప్రకటించాయి. ఇక కిందటి రోజు (ఏప్రిల్ 23) టాప్- 5 కంపెనీల్లో ఒకటి.. . ఇక్కడ మిగతా ఐటీ కంపెనీలకు భిన్నంగా మార్కెట్ అంచనాల్ని మించింది. లాభం, ఆదాయం అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే భారీగా పెరిగినా.. ఒకటే ఆందోళన కలిగిస్తోంది. అదే ఉద్యోగుల సంఖ్య తగ్గడం.అవును ఇన్ఫోసిస్‌లో 3 నెలల కాలంలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. ఫలితాల సమయంలోనే గురువారం రోజు ఈ డేటాను కూడా ప్రకటించింది ఇన్ఫీ. 2026, మార్చి 31 నాటికి సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594 గా ఉందని పేర్కొంది. అయితే 2025 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి చూస్తే ఉద్యోగుల సంఖ్య 3,37,034 గా ఉండేది. దీంతో 3 నెలల వ్యవధిలో ఏకంగా 8,440 మంది ఉద్యోగులు తగ్గడం కలవరపెడుతోంది. అంతకుముందు వరుసగా 6 త్రైమాసికాల్లోనూ ఇన్ఫోసిస్.. నికరంగా ఉద్యోగుల్ని పెంచుకోవడం విశేషం. అయితే వార్షిక ప్రాతిపదికన చూస్తే ఉద్యోగుల సంఖ్య 5 వేల వరకు పెరిగిందని సంస్థ వెల్లడించింది. పెరిగిన అట్రిషన్ రేటు..సేల్స్ అండ్ సపోర్ట్ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా పెరగ్గా.. కోర్ డెలివరీ సెగ్మెంట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ సంఖ్య 8,477 తగ్గడం గమనార్హం. ఇక్కడ ఇన్ఫోసిస్‌లో సమీక్షా త్రైమాసికంలో అట్రిషన్ రేటు 12.6 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో ఇది 12.3 శాతంగానే ఉండేది. ఇది సిబ్బంది వలసల్ని చూయిస్తుంది. అంటే.. ఒక కంపెనీని వీడి మరో కంపెనీలో చేరడం అన్నమాట. అట్రిషన్ రేటు పెరగడం అనేది.. కంపెనీ పట్ల ఉద్యోగులు విశ్వాసాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఇది పెరగడం సహా అంతర్జాతీయంగా అనిశ్చితి, ఐటీ రంగంలో మందగమనం నేపథ్యంలో కొత్తగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 వేల మంది ఫ్రెషర్లను (తాజా ఉత్తీర్ణులు) నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇన్ఫీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్ రాజ్‌కా చెప్పారు. మిగతా టెక్ కంపెనీల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. . హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రోలో వరుసగా 802, 135 చొప్పున పెరిగారు. టెక్ మహీంద్రాలో మాత్రం 1993 మంది తగ్గారు. వీటన్నింటికంటే.. ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు సంస్థను వీడారు. ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలు..ఇదిలా ఉంటే.. సమీక్షా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ. 8501 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో చూస్తే లాభం 21 శాతం పెరిగింది. సంస్థ కార్యకలాపాల ఆదాయం చూస్తే 13.4 శాతం పెరిగి రూ. 46,402 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 25 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది.