ట్రంప్ ‘నరక కూపం’ వ్యాఖ్యలపై ఇండియా ఆగ్రహం.. దెబ్బకు దిగొచ్చిన అమెరికా

Wait 5 sec.

: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ ఓ నరకకూపమంటూ ఓ పోస్టును రీషేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగడంతో.. దాన్ని చల్లార్చేందుకు అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భారత్‌పై చేసిన కామెంట్లపై భారతీయుల్లో వెల్లువెత్తిన ఆగ్రహాన్ని గమనించిన వైట్ హౌస్.. భారత్ ఒక గొప్ప దేశమని, భారత ప్రధాని తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని ట్రంప్ స్వయంగా అన్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది.అసలీ గొడవ ఏంటంటే..?అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ చాలా రోజులుగా భావిస్తున్నారు. అయితే దీనికి మద్దతుగా ఆయన మైఖేల్ సావేజ్ అనే కన్జర్వేటివ్ రచయిత చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో , అక్కడి నుంచి వచ్చే వలసదారులు కేవలం పౌరసత్వం కోసమే గర్భిణులను అమెరికాకు పంపిస్తున్నారని అత్యంత ఘాటుగా విమర్శించారు. అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి వచ్చే ఐటీ మేధావులు.. ల్యాప్‍‌‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండటంతో దౌత్యపరమైన చిక్కులు మొదలయ్యాయి.అమెరికా ఎంబసీ వివరణభారత మీడియాలో ఈ వార్త దావానంలా వ్యాపించడంతో అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి రంగంలోకి వచ్చారు. "భారత్ ఒక గొప్ప దేశం.. అక్కడ నాకు అత్యంత ఆప్తమిత్రుడు నాయకత్వం వహిస్తున్నారు" అని ట్రంప్ అన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఎప్పుడు, ఎక్కడ చేశారన్నది మాత్రం స్పష్టం చేయలేదు. కేవలం వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికే ఈ ప్రకటన చేసినట్లు దౌత్య నిపుణులు భావిస్తున్నారు.భారత విదేశాంగ శాఖ స్పందనఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను దీనిపై వివరణ కోరగా.. "మేము కొన్ని నివేదికలను చూశాం. ఆ వ్యాఖ్యలు అనుచితమైనవి, స్పష్టమైన అవగాహన లేనవి, అసభ్యకరమైనవి" అని జైస్వాల్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల వాస్తవికతను ప్రతిబించవన్న ఆయన.. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఈ బంధం ఎంతో కాలంగా కొనసాగుతోందన్నారు.నిజానికి ఈ వివాదానికి మూలమైన మైఖేల్ సావేజ్ తన పాడ్‌కాస్ట్‌లో అమెరికా సుప్రీం కోర్టు వాదనలను తప్పుబట్టారు. "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు" దేశ డెమోగ్రాఫిక్‌ను మార్చేస్తున్నారని, వీరికి అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా జెండాను వారు అగౌరవపరుస్తున్నారని జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉన్న తరుణంలో.. ఇలాంటి సోషల్ మీడియా ప్రకటనలు చిచ్చు పెట్టకుండా అమెరికా యంత్రాంగం వేగంగా స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.