West Bengal Election 2026: పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 152 నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహించగా.. 92.73 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రికార్డ్ ఓటింగ్ ఎవరికి అనుకూలమనే చర్చ జరుగుతోంది. తమ పార్టీనే గెలుస్తుందని టీఎంసీ ధీమాతో ఉండగా.. భారీ పోలింగ్ మార్పునకు సంకేతమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో మొగ్గు బీజేపీ వైపు ఉండొచ్చు లేదంటే హోరాహోరీ పోరు జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి . ఇది బెంగాల్ ఓటర్ల జాబితాలో 11.6 శాతానికి సమానం. ఇంత భారీగా ఓటర్లను తొలగించడం, బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఓటర్ల సంఖ్య తగ్గినా.. పోలింగ్ పైపైకి!గత ఎన్నికల్లో 100 మంది అర్హులైన ఓటర్లు ఉంటే.. ఈసారి ఆ సంఖ్య 90కి తగ్గింది. కానీ ఓటింగ్ సరళి మాత్రం పెరిగిపోయింది. గతంలో 100 మందిలో 80 మంది ఓటు వేశారు. ఇందులో టీఎంసీకి 35, బీజేపీకి 32 ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్ర మొత్తం ఓటర్ల సంఖ్య 90కి తగ్గినా.. 83 మంది ఓటు వేశారు. అంటే ఓటర్ల సంఖ్య తగ్గినా పోలింగ్ భారీగా పెరిగింది. ఓట్ల తొలగింపు టీఎంసీ ఓటమికి సంకేతమా? తొలగించిన 10 మంది ఓటర్లలో 8 మంది గతంలో ఓటు వేసిన వారేనని అనుకుంటే.. అందులో ఆరుగురు టీఎంసీ మద్దతుదారులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల సంఖ్య 35 నుంచి 29కి పడిపోతుంది. అయితే ఈసారి అదనంగా పోలైన 3 ఓట్లు (80 నుంచి 83కి పెరిగిన ఓట్లు) ఎవరి ఖాతాలోకి వెళ్తాయన్నదే ఇప్పుడు అసలైన ట్విస్ట్. ఒకవేళ పెరిగిన ఈ పోలింగ్ శాతం టీఎంసీ వైపు ఉంటే.. ఆ పార్టీ మళ్లీ 32 ఓట్లకు చేరుకుని బీజేపీతో హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. బీజేపీ స్వీప్ సాధ్యమేనా?అయితే రాజకీయ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఈ అదనపు పోలింగ్.. రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకునే సామాన్య ప్రజలది అయితే మాత్రం.. అది బీజేపీకి భారీ మెజారిటీని కట్టబెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే ఈ ఎన్నికల్లో బీజేపీదే ఘన విజయం అని వివరిస్తున్నారు. 5 ఏళ్లలోనే 3 సీట్ల నుంచి 77 సీట్లకు ఎగబాకిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్యను రెట్టింపు చేసి ఈసారి 154 సీట్లను సాధిస్తే అది అద్భుతంగానే నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఇది కాస్త కష్టమే అయినప్పటికీ బీజేపీ గెలవొచ్చని లేదంటే టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.