: మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? మరి క్రెడిట్ కార్డుల గురించి అన్ని రూల్స్ తెలుసా? లిమిట్ ఎంత ఉంటుంది.. ఎలా పెంచుకోవాలి.. బిల్ ఎప్పుడు చెల్లించాలి.. ఆలస్యమైతే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయనేది సహా ఇతర నియమ నిబంధనల గురించి కూడా తెలుసుకోవడం మంచిది. . అంటే క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ తెలివిగా ఉపయోగించడం అలవర్చుకోవాలి. అవగాహన లేకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఇప్పుడు 2 క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న ఒక తెలివైన కస్టమర్.. బ్యాంక్ చేసిన తప్పిదంతో.. నిర్లక్ష్యంతో.. లక్షల్లో పరిహారం పొందాడు. సదరు వ్యక్తి తన క్రెడిట్ కార్డుల్ని క్లోజ్ చేయాలని బ్యాంకును అభ్యర్థించినా.. అక్కడ ఆలస్యమైంది. దీనికి అదనంగా మళ్లీ బ్యాంక్.. అతడికి వార్షిక రుసుములు విధించడంతో అంబుడ్స్‌మెన్‌ను ఆశ్రయించాడు. దీంతో అక్కడ విజయం సాధించాడు. బ్యాంక్ నుంచి తన అభ్యర్థనలో జాప్యానికి పరిహారంగా రూ. 3.21 లక్షలు పొందాడు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో పంచుకోగా ఇది వైరల్ అవుతోంది. తన క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 10 వేలకు తగ్గించడంతో తన క్రెడిట్ కార్డుల్ని క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. 2025 మే నెలలో కోటక్ మింత్రా, కోటక్ మోజో ప్లాటినమ్ అనే రెండు క్రెడిట్ కార్డుల్ని లిమిట్ రూ. 1 లక్ష నుంచి 10 వేలకు తగ్గించడంతో క్లోజ్ చేయాలని బ్యాంకుకు మెయిల్ చేశాడు. తర్వాత మరో 2 రిమైండర్ ఇమెయిల్స్ చేసినప్పటికీ బ్యాంక్ నుంచి రెస్పాన్స్ లేదు. తన అభ్యర్థన మేరకు.. బ్యాంక్ క్రెడిట్ కార్డుల్ని క్లోజ్ చేయకపోగా ఇంకా వార్షిక రుసుముల్ని విధించింది. దీంతో హైయర్ అథారిటీస్‌ను ఆశ్రయించగా.. పరిహారం పొందాడు. 2025 మే నెలలో కార్డ్ క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ చేయగా.. 2026 ఏప్రిల్ నెలలో యాన్యువల్ ఫీజు రూ. 1180 చెల్లించాలని అతడికి బ్యాంక్ నుంచి అలర్ట్ వచ్చినట్లు గమనించాడు. అప్పుడు బ్యాంకును ప్రశ్నించగా.. క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయలేదని సమాధానం వచ్చింది. దాంతో అతడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాడు. అప్పుడు బ్యాంక్ నోడల్ అధికారి.. 'ఇది నీ పొరపాటు. ఇ- మెయిల్ ద్వారా క్లోజర్ రిక్వెస్ట్స్ అంగీకరించబడవు. మీరు కాల్ చేయాల్సింది.' అని సమాధానం వచ్చినట్లు బాధితుడు స్పష్టం చేశాడు. అయితే అతను రాతపూర్వకంగా క్లోజర్ రిక్వెస్ట్ చేసినట్లు.. ఫాల్ అప్ రిమైండర్స్ కూడా చేసినట్లు పేర్కొన్నాడు. కానీ బ్యాంక్ నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పాడు. దీంతో అతడికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అతడి బ్యాంకు ఖాతాలో రూ. 3.21 లక్షలు జమ అయినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌ను కూడా రెడిట్‌లో షేర్ చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కస్టమర్ .. క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ రిక్వెస్ట్ ఇచ్చిన 7 పని దినాల్లోపు కార్డును మూసేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆలస్యమైతే.. జాప్యం జరిగిన ప్రతి రోజుకు రూ. 500 చొప్పున వినియోగదారుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అతను 2025, మే 23న క్లోజింగ్ రిక్వెస్ట్ చేశాడు. అంటే వారం రోజుల్లో జూన్ 1 కల్లా క్లోజ్ చేయాల్సి ఉండేది. అలా చేయలేదు. దీంతో 2025, జూన్ 1 నుంచి 2026, ఏప్రిల్ 18 వరకు మొత్తం 321 రోజులకు.. రోజుకు రూ. 500 చొప్పున పరిహారం వచ్చింది. 2 క్రెడిట్ కార్డులు కాబట్టి మొత్తం రూ. 321x 2x 500= రూ. 3,21,000 పరిహారం వచ్చింది.