PAN Card Rules: అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, ఆదాయపు పన్ను నియమావళి-2026 ప్రకారం నిర్దేశిత పరిమితి దాటిన ట్రాన్సాక్షన్లకు ఇకపై పాన్ కార్డు (PAN) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పాన్ కార్డు లేని వారు కొన్ని ట్రాన్సాక్షన్లకు ఫామ్ 60 సమర్పించి ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేవారు. పని చేయదు. బంగారం కొనుగోలు, కారు, బైక్, భూమి, ఇల్లు కొనుగోలు సహా పెట్టుబడుల విలువ రూ.50 వేలు దాటినప్పుడు పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.బంగారం వంటి కొన్ని వస్తువులు, డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ వంటి సర్వీసులు ఇకపై పాన్ కార్డు లేకుండా పూర్తి చేయడం కుదరదు. అంతకు ముందు ఫామ్ 60 ఇస్తే సరిపోయేది. కానీ, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లో మారిన నిబంధనల ప్రకారం కొత్త ఫామ్ 97 సైతం ఇచ్చేందుకు అనుమతి లేదు. తప్పనిసరిగా పాన్ ఉండాల్సిందే అని గుర్తుంచుకోవాలి. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి వచ్చాయి. కొత్త ఫామ్స్ ఫీచర్లు చాలా సులభమైన భాషలో, నిర్దేశిత ఫార్మాట్లూ కొంత వరకు సమాచారం ఫిల్ చేసి, టెక్నాలజీ ఆధారిత ప్రాసెస్ ఉంటుంది. దీంతో తప్పులు, పొరపాట్లు దొర్లకుండా ఉంటుంది. ట్యాక్స్ విభాగం బ్రోచర్ ప్రకారం రీ-ఇంజనీర్డ్ ఫామ్ 97,98 అనేవి ఫామ్ 60, 61 స్థానంలో తీసుకొచ్చారు. కొత్త ఫామ్స్ ద్వారా ఫైలింగ్ సమయం అనేది 80-85 శాతం తగ్గిపోతుందని ఐటీ విభాగం చెబుతోంది. వీటి పాన్ కార్డు తప్పనిసరి. క్రెడిట్ కార్డు అప్లికేషన్‌కి పాన్ కార్డు ఉండాల్సిందేడీమ్యాట్ అకౌంట్ తెరిచేందుకు పాన్ తప్పనిసరిమ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్స్, బాండ్లలో రూ.50 వేలకు మించి పెట్టుబడి పెట్టినప్పుడు పాన్ తప్పనిసరిక్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ నిర్దేశిత పరిమితి రూ.10 లక్షలు మించినప్పుడు తప్పనిసరి.సెక్యూరిటీల కొనుగోలు, విక్రయ కాంట్రాక్టులు ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.1 లక్ష దాటితే పాన్ తప్పనిసరిఅన్‌లిస్టెడ్ షేర్లు రూ.1 లక్షకు మించి కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేసినప్పుడు పాన్ తప్పనిసరిఅలాగే విదేశీ కరెన్సీ కొనుగోలు, బ్యాంక్ డ్రాఫ్ట్స్ కొనుగోలు, పే ఆర్డర్స్, ఇతర బ్యాంక్ చెక్స్, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ని ఫామ్-97 పరిధి నుంచి పూర్తిగా తొలగించారు.