‘అకీరా క్రమశిక్షణ లేకుండా తయారవుతాడని నా మాజీ భర్త కుటుంబ సభ్యులు అనేవారు’.. రేణూ దేశాయ్ ఎమోషనల్

Wait 5 sec.

గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో మోడల్ గా చేసిన ఆమె.. నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, డైరెక్టర్ గా తనలోనే మల్టీటాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. పెళ్లి తరువాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరమైన రేణూ, సపోర్టింగ్ రోల్స్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తన ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్.. వ్యక్తగత జీవితం, తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణూ దేశాయ్.. భర్తతో విడిపోయాక తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. విడాకులు తీసుకున్నా కూడా తన మాజీ భర్తకు, ఆయన కుటుంబానికి పిల్లలను దగ్గర చేస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఏదైనా వేడుక జరిగినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో అకీరా, ఆద్య స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తుంటారు. అయితే ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఎలా నడుచుకోవాలి అనేది ముందే తన ఇద్దరు పిల్లలకు చెప్పానని, ఆ విషయంలో ఒక కండీషన్ కూడా పెట్టినట్లు రేణూ తెలిపారు.''పిల్లల్ని ఆ ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను. 'మీరిద్దరూ వాళ్లతో ఎలా బిహేవ్ చేస్తారదే ఒక తల్లిగా నాపై ప్రభావం చూపుతుంది. నేను మిమ్మల్ని సరిగ్గా పెంచానా లేదా అనేది నా పెంపకం మీద వస్తుంది. ఎలా మాట్లాడతారు? ఎలా ప్రవర్తిస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? అనేది మీ తల్లిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మీ తల్లి గురించి ఆలోచించండి. గౌరవంగా ఉండండి.. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా, ఇరిటేట్ అయినా నాకు ఫోన్ చేయండి. అంతేకానీ ఎప్పుడు కూడా ఎవరి పట్ల అగౌరవంగా ప్రవర్తించకండి. ఎందుకంటే నా పెంపకం మీద మచ్చ పడకూడదు' అని చెప్పాను'' అంటూ అకీరా, ఆద్య గురించి చెబుతూ అయ్యారు. తన ఇద్దరు పిల్లలకు మంచీ మర్యాద నేర్పించి పెంచానని రేణూ దేశాయ్ అన్నారు. అకీరాని కొట్టకపోవడంతో, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తన కుమారుడి భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ అకీరా ఎంతో క్రమశిక్షణ కలిగిన అబ్బాయిగా ఎదిగాడని ఆమె తెలిపారు. ''నా మాజీ భర్త కుటుంబ సభ్యులు కొందరు.. 'నువ్వు అకీరాను అస్సలు కొట్టడం లేదు. వాడు క్రమశిక్షణ లేకుండా తయారవుతాడు' అని అనేవారు. అప్పుడు నేను వాళ్లకి ఎలా పెంచుతానో వేచి చూడండి అని చెప్పాను. ఈ రోజు మీరు ఎక్కడ వెతికినా దొరకనంత మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్, ఎంతో ఒదిగి ఉండే, అత్యంత క్రమశిక్షణ కలిగిన బిడ్డగా అకీరా తయారయ్యాడు. ఆద్య కూడా అంతే. నేను ఎప్పుడూ నా పిల్లల్ని కొట్టలేదు'' అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.