ముంబయి-సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పుణె సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలు పుణే స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా.. డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఒక కోచ్ ట్రాలీ పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. కానీ, ఈ ప్రమాదంలో ఒక్కరికి కూడా గాయం కాలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మండ్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని పుణే స్టేషన్ యార్డ్ రీమోడలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఆ ప్రదేశంలో వందే భారత్ రైలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. సీ 15 కోచ్ పట్టాలు తప్పిందని వారు తెలిపారు.ఈ ప్రమాదంలో ఓ కోచ్ పట్టాలు తప్పిందని, అందులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. రైలు నిలిపివేసి అందులోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించినట్టు మధ్య రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రైస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, వందే భారత్ రైలు ప్రారంభమైన తర్వాత పట్టాలు తప్పడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 2019లో మోదీ ప్రభుత్వం వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైలు దేశంలో మొదలయ్యాయి. అప్పటి నుంచి 2026 మధ్య ఈ తరహా ఘటన తొలిసారి జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకూ ఈ రైళ్లు అత్యంత సురక్షితమైనవిగా పేరుంది. ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థ ఇందులో ఉంటుంది.