పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ.. బర్త్‌డే, మ్యారేజ్‌డేలకు సెలవు, 22 మంది డీఎస్పీల బదిలీలు

Wait 5 sec.

పోలీసులు అంటే ఎంత కఠినంగా ఉంటారో వారి లైఫ్‌స్టైల్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. అంటే.. డ్యూటీలో భాగంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పండగలు, ప్రత్యేక రోజులు వంటివి ఏవి ఉన్నా.. కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల కోసం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల జీవితాల్లో ఉండే ప్రత్యేక రోజులను.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల పుట్టినరోజు.. పెళ్లి రోజున వారికి ప్రత్యేకంగా సెలవు మంజూరు చేయాలని పేర్కొంటూ తాజాగా డీజీపీ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. ఒత్తిడిలో పనిచేస్తూ పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి అస్సలు సమయం ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్న డీజీపీ వారి కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచించినట్లు తెలిపారు. పోలీసులకు మానసిక ఉల్లాసంతో పాటు.. తమ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సెలవుల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప పోలీసు సిబ్బందికి ఈ రెండు రోజుల సెలవులను మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా పోలీసులకు పెళ్లి రోజు, పుట్టిన రోజుల్లో సెలవులను మంజూరు చేయనున్నట్లు తేల్చి చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్లు అయ్యారు. ఈ డీఎస్పీ ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి కూడా డీజీపీ శివధర్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పలువురు ఏసీపీలు కూడా బదిలీ అయ్యారు.రాష్ట్రంలో బదిలీ అయిన డీఎస్పీల వివరాలుఓయూ ఏసీపీ - నర్సింగరావుఉప్పల్‌ ఏసీపీ - వెంకట్‌రెడ్డిచిక్కడపల్లి ఏసీపీ - రణ్‌వీర్‌రెడ్డిమలక్‌పేట ఏసీపీ - రాజా వెంకట్‌రెడ్డిగోషామహల్‌ ఏసీపీ - చంద్రశేఖర్‌రెడ్డిఆసిఫ్‌నగర్‌ ఏసీపీ - శ్రీనివాస్‌మేడ్చల్‌ ట్రాఫిక్ ఏసీపీ - వెంకటేశ్వరరావువికారాబాద్ ఏసీపీ - అంజయ్యమల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఏసీపీ - రాజశేఖర్‌రెడ్డి జగిత్యాల డీఎస్పీ - పురుషోత్తంరెడ్డి కామారెడ్డి డీఎస్పీ - మధుసూదన్ఆసిఫాబాద్ డీఎస్పీ - అశోక్‌భద్రాచలం డీఎస్పీ - అరుణ్‌కుమార్నిర్మల్‌ డీఎస్పీ - టీ శ్రీనివాస్