ఢిల్లీ క్యాపిటల్స్ 8/6.. అయినా, ఆర్సీబీ 49 రికార్డు సేఫ్! ఐపీఎల్ 2026లో ఢిల్లీ లోయెస్ట్ స్కోర్

Wait 5 sec.

ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డుకు వెంట్రుకవాసు దూరంలో తప్పించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీద ఉన్న లోయెస్ట్ స్కోర్ రికార్డు ఇన్నాళ్లకు బ్రేక్ అవుతుందని అందరూ అనుకున్నారు. 2017లో కేకేఆర్ మీద ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇదే లోయెస్ట్ స్కోర్.. కానీ ఆ చెత్త రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా ఢిల్లీని 49 పరుగుల లోపు ఆలౌట్ చేయడంలో ఆర్సీబీ విఫలమైంది. అభిషేక్ పోరెల్ పోరాటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో ఇదే లోయెస్ట్ స్కోర్ కావడం విశేషం.అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ పేస్ బౌలింగ్ దెబ్బకు పిట్టల్లా రాలిపోయింది. రెండో బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయగా.. ఆ స్వాగ్‌ను జోష్ హేజిల్‌వుడ్ కొనసాగించాడు. రెండో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసుకోవడంతో కేవలం రెండు పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఏడు పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో హేజిల్‌వుడ్ వేసిన డెడ్లీ బౌన్సర్‌కి నితీష్ రాణా కూడా వికెట్ కోల్పోయాడు. దాంతో నాలుగు ఓవర్లలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8 పరగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 13 పరుగులే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ కాపాడారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 31 బంతుల్లో 35 పరుగులు నెలకొల్పి ఢిల్లీని 49 పరుగుల లోపు ఆలౌట్ కాకుండా చేశారు. ఆ తర్వాత కైల్ జెమీసన్ 12 పరుగులు చేయడంతో ఢిల్లీ 49 పరుగులు దాటేసింది. అభిషేక్ పోరెల్ 33 బంతుల్లో 30 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగుల వరకూ వెళ్లింది. ఆర్సీబీకి 76 పరుగుల ఈజీ టార్గెట్ అందించింది.ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఇలా సాగింది సాహిల్ పరాఖ్ 0 (2), కేఎల్ రాహుల్ 1 (3), నితీష్ రాణా 1 (9), సమీర్ రిజ్వీ 0 (1), ట్రిస్టన్ స్టబ్స్ 5(3), అక్షర్ పటేల్ 0 (3), డేవిడ్ మిల్లర్ 19 (18), కైల్ జెమీసన్ 12 (13), కుల్దీప్ యాదవ్ 3 (11), అభిషేక్ పోరెల్ 30 (33), దుష్మత చమీరా 0 (3) నాటౌట్. భువనేశ్వర్ కుమార్ 5 పరుగులకే మూడు వికెట్లు తీయగా, జోష్ హేజిల్‌వుడ్ 12 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషిక్ సలామ్ దార్ , సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసుకోవడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది.