ఐపీఎల్ 2026లో తన హవా కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లి సొంతగడ్డ మీద ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో డామినేషన్ ప్రదర్శించిన ఢిల్లీ క్యాపిటల్స్ అందించిన లక్ష్యాన్ని పవర్ ప్లే లోపే ఛేదించి రికార్డు క్రియేట్ చేసింది. బెంగళూరు వేదికగా దక్కిన ఓటమికి ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రివేంజ్ తీర్చుకుంది.అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు, బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీని చిత్తు చిత్తు చేసింది. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఒకానొక దశలో పవర్ ప్లే లోపే ఆర్సీబీ మ్యాచ్ని ముగిస్తుంది అని అనుకున్నారు. కానీ.. మరో మూడు బంతులు అదనంగా తీసుకుని ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన ఆర్సీబీకి విరాట్ కోహ్లి విన్నింగ్ షాట్ కొట్టి విజయాన్ని అందించాడు. కైల్ జెమీసన్ వేసిన తొలి ఓవర్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండో ఓవర్‌లో కూడా ఆరు పరుగులే రావడంతో తొలి రెండు ఓవర్లలో ఆర్సీబీ 13 పరుగులు మాత్రమే చేసింది. కానీ.. మూడో ఓవర్ నుంచి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. జెమీసన్ ఓవర్‌లో బెతెల్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. బెతెల్ అవుటయ్యే సమయానికి ఆర్సీబీ 27/1గా ఉంది. దేవదత్ పడిక్కల్ ఎప్పుడైతే క్రీజులోకి వచ్చాడు అప్పటి నుంచి బౌండరీల మోత మొదలైంది. నాలుగో ఓవర్‌లో 12 పరుగులు రాగా.. ఐదో ఓవర్‌లో 21 పరుగులు రాబట్టారు. పవర్ ప్లే చివరి ఓవర్‌లో కేవలం 5 పరుగులే రావడంతో విజయం కోసం ఏడో ఓవర్ వరకూ ఆగాల్సి వచ్చింది. నటరాజన్ వేసిన ఏడో ఓవర్‌లో విరాట్ కోహ్లి వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించాడు. 6.3 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఆర్సీబీ 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జాకబ్ బెతెల్ 11 బంతుల్లో 20 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 15 బంతుల్లో 23, దేవదత్ పడిక్కల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.