దేశంలో తొలిసారి డిజిటల్ జనగణన.. పేపర్ నుంచి యాప్ వరకూ.. ఏంటీ ‘CMMS’

Wait 5 sec.

దేశంలో 16వ జనాభా లెక్కల ప్రక్రియ మొదలైంది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుత ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా.. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో వాయిదా వేశారు. అనేక ప్రాంతాలు, వర్గాలకు సంబంధించిన అవసరాలను అంచనా వేయడానికి జనాభా గణన ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా వైద్యం, విద్యా వ్యవస్థ, సంక్షేమ పథకాలు, మౌలిక సౌకర్యాల కల్పన, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ లెక్కలే ఆధారం. కాగా, ఈసారి జనగణన ప్రక్రియ డిజిటల్‌గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జనగణన డిజిటలైజేషన్, పర్యవేక్షణ కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ సెన్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టమ్ (Census Management And Monitoring System- CMMS)ను రూపొందించింది. ఈ పోర్టల్ జనగణనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఎన్యూమరేటర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారందరినీ సమన్వయం చేయడం, డేటా సక్రమంగా నమోదు అవుతుందో? లేదో? చూడటం, మొత్తం ప్రక్రియను ఒకే చోట నుంచి పర్యవేక్షించడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.యూజర్ మేనేజ్‌మెంట్: ఈ ప్రక్రియలో పాల్గొనే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, అధికారులందరికీ యూజర్ ఐడిలు క్రియేట్ చేసి, బాధ్యతలు కేటాయించడం.క్షేత్ర స్థాయి పర్యవేక్షణ: ఎన్యూమరేటర్లు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎంత శాతం పని పూర్తయింది? అనే అంశాలను అధికారులు పర్యవేక్షించవచ్చు.మెటీరియల్ మేనేజ్‌మెంట్: జనగణనకు అవసరమైన కిట్లు, ఇతర సామాగ్రి పంపిణీ ట్రాకింగ్.చెల్లింపుల నిర్వహణ: జనగణనలో పాల్గొన్న సిబ్బందికి అందాల్సిన గౌరవ వేతనాలను బ్యాంక్ ఖాతాలకు నేరుగా పంపే ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది.డిజిటల్ జనగణనలో ప్రాముఖ్యతగతంలో పేపర్ల మీద సమాచారం సేకరించేవారు. అది ప్రభుత్వానికి చేరడానికి చాలా సమయం పట్టేది. కానీ, సీఎంఎంఎస్ ద్వారా ఎన్యూమరేటర్ మొబైల్ యాప్‌లో డేటా ఎంటర్ చేయగానే సర్వర్‌కు చేరుతుంది. సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే గుర్తిస్తుంది. అలాగే, పై అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందికి నోటిఫికేషన్ల ద్వారా సూచనలు పంపవచ్చు.జాతీయస్థాయిలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్, రాష్ట్రస్థాయిలో సెన్సెస్ ఆఫరేషన్స్ డైరెక్టర్, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల, మున్సిపల్ స్థాయిలో తహశీల్దార్లు లేదా మున్సిపల్ కమిషనర్లు దీనిని ఉపయోగిస్తారు. జనగణన ప్రక్రియ నిర్వహణకు ఇది ఒక కంట్రోల్ రూమ్ లాంటిది. పారదర్శకతను పెంచడమే కాకుండా ఫలితాలను త్వరగా వెల్లడించడానికి సహాయపడుతుంది. దేశంలో 16వ జనాభా లెక్కల ప్రక్రియ మొదలు కాగా.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుగుతోన్న 8వ జనగణన ఇది.