ఇక ఫిజికల్ కార్డ్ అక్కర్లేదు.. గూగుల్ వాలెట్‌లోనే 'ఆధార్'.. ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసా?

Wait 5 sec.

: మన దేశంలో ఆధార్ కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రకమైన ప్రభుత్వ సేవ అయినా.. బ్యాంకింగ్ లావాదేవీలైనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ పొందాలన్నా ఇది చాలా ముఖ్యం. ఆధార్ లేకుండా చాలా వరకు ఈ పనులు ముందుకు సాగవని చెప్పొచ్చు. ఒకప్పుడు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్‌గానే ఉపయోగించిన ఈ కార్డు ఇప్పుడు ప్రతి వ్యక్తి.. జీవితంలోనూ కీలకంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి.. పాన్ కార్డు కోసం, జనన ధ్రువీకరణ కోసం.. మొబైల్ సిమ్ కోసం.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు.. . బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాతో కూడిన ఈ 12 అంకెల ఆధార్‌కు సంబంధించి ఇప్పుడు కీలక అప్డేట్ వచ్చింది. >> అయితే ప్రతిసారీ మనం ఆధార్ కార్డును వెంటతీసుకెళ్లలేకపోవచ్చు. కొన్ని సార్లు ఒరిజినల్ కూడా కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు కార్డును పోగొట్టుకోవాల్సి వస్తుంది కూడా. అందుకే ఈ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాజాగా.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థతో (UIDAI) గూగుల్ జట్టు కట్టింది. ఇప్పుడు గూగుల్‌కు చెందిటువంటి గూగుల్ వాలెట్‌లో ఆధార్ వివరాల్ని సేవ్ చేసుకునే సదుపాయం వచ్చింది. తాజా నిర్ణయంతో.. స్మార్ట్‌ఫోన్‌లోనే డిజిటల్ వెర్షన్ ఆధార్‌ను పెట్టుకునే వీలవుతుంది. ఈ మేరకు గూగుల్.. ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఇక ఎక్కడైనా మీరు ఆధార్ వివరాల్ని ధ్రువీకరించాల్సిన చోట ఈ వాలెట్ ఉపయోగిస్తే సరిపోతుంది. దీంతో ఫిజికల్ కార్డు వెంటతీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. >> వివరాల్ని సేవ్ చేయడం ద్వారా.. ఆన్‌లైన్ సహా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అవసరాల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని గూగుల్ పేర్కొంది. కేవలం వయసును మాత్రమే వెరిఫై చేసుకోవాల్సిన చోట.. పూర్తి ఆధార్ వివరాల్ని ఇవ్వాల్సిన అవసరం తప్పుతుందని తెలిపింది గూగుల్. మరి గూగుల్ వాలెట్‌లో ఆధార్ వివరాలు ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాం. వాలెట్‌లో ఆధార్ ఎలా సేవ్ చేసుకోవాలి?ముందుగా గూగుల్ లేటెస్ట్ వెర్షన్ యాప్ ఓపెన్ చేసి.. + (ప్లస్) లేదా యాడ్ వాలెట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మెనూలో ఐడీ పాస్ లేకపోతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి.తర్వాత ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వెళ్లే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా కాకుండా.. UIDAI ఆధార్ యాప్‌లోని షేర్ ఐడీ ఆప్షన్‌తో కూడా గూగుల్ వాలెట్‌లో ఆధార్ వివరాల్ని సేవ్ చేయొచ్చు.