టాప్- 5 ఐటీ కంపెనీలు.. 7 వేల మంది ఉద్యోగులు అవుట్.. టీసీఎస్‌లోనే మరీ ఘోరం!

Wait 5 sec.

Reduction: కొంత కాలంగా దిగ్గజ టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు సంస్థలు.. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌పై (AI) పెట్టుబడులు పెడుతూ.. తమ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచాలని చూస్తున్నాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా.. ఉద్యోగుల్ని తగ్గిస్తూ వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో భారత టాప్-5 ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చేది. కొంత కాలంగా ఆర్థిక మందగమనం సహా ఏఐ టూల్స్ ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టించాయి. దీంతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించాయి. ఇందులో భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందు వరుసలో ఉంది. దీంట్లోనే అధిక సంఖ్యలో ఉద్యోగులు తగ్గుముఖం పట్టారు. . ఇక్కడ ఈసారి ఫలితాలు కాస్త మెరుగ్గానే నమోదయ్యాయి. అయినప్పటికీ భవిష్యత్తు ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించిన నేపథ్యంలో.. స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. ఇదే సమయంలో కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్య పెరగడం, తగ్గడం సహా పూర్తి ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగుల సంఖ్య ఎలా ఉంది.. భవిష్యత్తులో నియామకాలు ఎలా ఉండనున్నాయనే దానిపైనా ప్రకటనలు చేశాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల్ని తగ్గించేశాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రతిభావంతుల్ని.. అడ్వాన్స్‌డ్ స్కిల్స్ ఉన్న వారివైపు మొగ్గుచూపాయి. ఇదే సమయంలో పనితీరు అంతగా బాగోలేని వారిని తొలగిస్తూ వచ్చాయి. ఇలా మొత్తంగా ఐటీ కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గింది. సుమారు 7 వేలు తగ్గిన ఉద్యోగుల సంఖ్య..భారత టాప్- 5 ఐటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా వీటిల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 6,981 తగ్గింది. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఉద్యోగుల సంఖ్య 12,718 పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌లోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య 23,460 తగ్గింది. . టెక్ మహీంద్రాలో 1108 మంది ఉద్యోగులు తగ్గారు. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు మాత్రం స్వల్పంగా నియామకాల్ని చేపట్టడంతో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇన్ఫోసిస్‌లో 5016 మంది ఉద్యోగులు పెరిగారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య ఇక్కడ 6,338 మంది పెరిగారు. . 2021-22 లో మాత్రం ఏకంగా సంవత్సరంలో 54,396 మంది పెరిగారు. టీసీఎస్‌లో 2021-22లో రికార్డు స్థాయిలో ఉద్యోగుల సంఖ్య 1,03,546 పెరగడం గమనార్హం. విప్రోలో 2025-26లో ఉద్యోగుల సంఖ్య 8,810 పెరగ్గా.. అంతకుముందు 732 మంది మాత్రమే పెరిగారు. హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగుల సంఖ్య 3,761 పెరిగింది. దీనికి ముందటి ఆర్థిక సంవత్సరంలో 4061 మంది తగ్గారు.