వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేశారంటూ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం అనంతబాబు, అతని భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రరం కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. అయితే కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. శనివారం ఉదయం వరకూ విచారించారు. ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కాకినాడ మొబైల్ కోర్టు ఎదుట అనంతబాబును హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్డు అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి జైలుకు తరలించారు.