నేడు అమెరికా, ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలు.. ఎజెండా ఏంటి?

Wait 5 sec.

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండగా.. సిద్ధమయ్యాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగే ఈ చర్చల కోసం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారేడ్ కుష్నర్‌‌లు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అలాగే, ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాఘ్ఛీ పాల్గొంటారని అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ముగిసే సూచనలు కనిపించనప్పటికీ ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో మూడు వారాల పాటు పొడిగించిన మర్నాడే శాంతి చర్చలు జరగడం ఆశలు రెకెత్తుతున్నాయి.తమ ప్రతినిధులు.. ఇరాన్ బృందంతో వ్యక్తిగతంగా చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించగా.. ఇరాన్ అధికారిక మీడియా ప్రత్యక్ష చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... తమ ఇద్దరు రాయబారులు అరాఘ్చీతో చర్చలు జరుపుతారని చెప్పారు. ‘‘ సంభాషణలు ఫలప్రదమై.. తద్వారా ఒప్పందం దిశగా పురోగతి సాధిస్తామని మేము ఆశిస్తున్నాం’’ అని లీవిట్ అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్లలేదు కానీ ఈ వ్యవహారంలో ఆయన భాగస్వామిగా ఉంటారని ఆమె తెలిపారు.యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలపై చర్చించేందుకు పాకిస్థాన్ పర్యటన అనంతరం.. ఒమన్, రష్యాలను అరాఘ్చీ సందర్శిస్తారని ఇరాన్ ప్రతినిధి తెలిపారు. అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. మళ్లీ రెండో విడత చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ శుద్ధిచేసిన యురేనియం అప్పగింత, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ యుద్ధం వంటి మూడు కీలక అంశాలపై విభేదాల కారణంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. యురేనియం శుద్ధిచేయడం తమ హక్కుని ఇరాన్ నొక్కి చెప్పింది. అయితే, వాటి స్థాయిపై చర్చలకు మాత్రం మాకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.ఇరాన్‌తో 21 గంటల పాటు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ‘‘వారి అణు కార్యక్రమం, గతంలో శుద్ధిచేసిన యురేనియం ధ్వంసం చేశాం... కానీ, మరిన్ని అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమనే మాటకు వారు కట్టుబడి ఉన్నట్లు మాకు కనిపించడం లేదు’’ అని ఆయన తెలిపారు.అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణను తగ్గించడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇరాన్, అమెరికా, చైనా, సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఘర్షణల తగ్గింపునకు పాకిస్థాన్ ఉయోగించుకుంటోంది.1979 నాటి ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత దౌత్యపరమైన సంప్రదింపులలో పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు ఒకటి. 2013 సెప్టెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అణు కార్యక్రమం గురించి చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీకి ఫోన్ చేశారు. చివరిగా ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ప్రత్యక్ష సంప్రదింపులు ఇవే.